ఆధార్ చట్టం 2016, మనీ లాండరింగ్ చట్టం 2005, భారతీయ టెలిగ్రాఫ్ చట్టం, 1885 లలో సవరణలు చేయడానికి వీలుగా ఆర్డినెన్సు జారీ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియ జేసింది. 2019 జనవరి 4వ తేదీన లోక్ సభ ఆమోదించిన బిల్లు లో పొందుపరిచిన సవరణలనే ఈ ఆర్డినెన్సు లో పొందుపరచడం జరిగింది.
ప్రభావం :
ఆధార్ ను దుర్వినియోగ పరచకుండా నివారించే విధంగానూ, ప్రజల ప్రయోజనాల ను పరిరక్షించే విధంగాను, ఆధార్ యంత్రాంగాన్ని యుఐడిఎఐ మరింత పటిష్టం గా అమలు చేసేవిధంగా – ఈ సవరణలను – రూపొందించారు. పార్లమెంటు రూపొందించిన చట్టాల లో నిర్దేశించిన సమయంలో తప్ప – ఏ వక్తినీ తన వ్యక్తిగత గుర్తింపు వ్యక్తపరిచే సమయంలో – ఆధార్ తప్పనిసరిగా కలిగిఉండాలని ఒత్తిడి చేయరాదని – ఈ సవరణల్లో – పేర్కొన్నారు.
ప్రధాన లక్షణాలు:-
ఈ సవరణల ప్రధానలక్షణాలు ఈ విధంగా ఉన్నాయి–
· ఆధార్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తి అనుమతి తో ఆధార్ నెంబరు ను భౌతికం గా లేదా ఎలక్ట్రానిక్ రూపం లో ప్రమాణం గా లేదా ఆఫ్ లైన్ లో ధృవీకరణకు ఉపయోగించుకోవచ్చు.
· ఆధార్ నంబరు కలిగిన వ్యక్తి యొక్క వాస్తవాలను వెల్లడి చేయకుండా – కేవలం ఆ వ్యక్తి యొక్క 12 అంకెల ఆధార్ సంఖ్య ను మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.
· ఆధార్ నెంబరు కలిగి ఉన్న చిన్న పిల్లలు, 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత వారి ఆధార్ నెంబరు ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.
· అధికారి పేర్కొన్న విధంగా వ్యక్తిగత గోప్యత, భద్రత పై పిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి వివరాల ధృవీకరణ కు ఎంటిటిటి లను అనుమతిస్తారు. పార్లమెంటు రూపొందించిన చట్టం లేదా నిర్ణీత రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల పరిధి లో ఉన్నపుడు మాత్రమే ధృవీకరణ ను అనుమతిస్తారు.
· టెలీగ్రాఫ్ చట్టం, 1885, మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద స్వచ్చందం గా ఆమోదయోగ్యమైన కెవైసి పత్రం సహాయం తో ధ్రువీకరణ కోసం ఆధార నంబరు ను ఉపయోగించడానికి అనుమతిస్తారు.
· ప్రైవేటు ఎంటిటి లు ఆధార్ ను ఉపయోగించడానికి సంబంధించి ఆధార్ చట్టం లోని 57 సెక్షన్ ను తొలిగించడానికి ప్రతిపాదన.
· ధ్రువీకరణ చేపట్టడాని కి నిరాకరించినా లేదా చేయలేక పోయినా, సేవల నిరాకరణ ను నిరోధిస్తుంది.
· భారత విశిష్ట గుర్తింపు సాధికార సంస్థ నిధి ఏర్పాటుకు అవకాశం.
· ఆధార్ చట్టం ఉల్లంఘన కు సంబంధించి పౌర జరిమానాలు, వాటి న్యాయ నిర్ణయం, విజ్ఞప్తుల కు అవకాశం, ఆధార్ వ్యవస్థ లో ఎంటిటీల నిబంధనలు.
నేపధ్యం :
సుప్రీం కోర్టు 2012 నాటి డబ్ల్యుపి (సివిల్)నెంబరు. 494 కేసు తదితర పిటిషన్ల పై 26.9.2018 తేదీన వెలువరించిన తన తీర్పు రాజ్యాంగపరం గా చెల్లుబాటు లో ఉంటుంది. అయితే, ఆధార్ చట్టం మరియు నిబంధనల కు సంబంధించిన కొన్ని సెక్షన్ల ను, ఇది నియంత్రిస్తుంది, గోప్యత కు సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ విషయం లో పలు ఇతర ఆదేశాల ను జారీ చేసింది.
తత్ఫలితం గా, సుప్రీం కోర్టు ఆదేశాల కు, సమాచార పరిరక్షణ పై ఏర్పాటైన రిటైర్డ్ జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటి నివేదిక కు అనుగుణంగా, ఆధార్ కలిగి ఉన్నవారి వ్యక్తిగత సమాచారం ఎటువంటి దుర్వినియోగానికి గురికాకుండా పరిరక్షించడానికి, రాజ్యాంగం లో పేర్కొన్న విధంగా ఆధార్ పధకం పరిరక్షించడానికి , ఆధార్ చట్టం, భారతీయ టెలిగ్రాఫ్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాలను సవరించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ దిశగా, ఆధార్ మరియు ఇతర చట్టాలు (సవరణ) బిల్లు, 2018 ని లోక్ సభ 2019 జనవరి 4వ తేదీన ఆమోదించింది. అయితే, ఈ బిల్లును రాజ్యసభ లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందే లోగా, రాజ్యసభ నిరవధికం గా వాయిదా పడింది.
***