ఆధార్ కార్డు ను ప్రజల కు అనుకూలమైన విధం గా రూపొందించాలనే లక్ష్యం తో ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) ఆర్డినెన్సు, 2019 స్థానం లో చట్టాన్ని తీసుకు రావడానికి ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. 2019వ సంవత్సరం మార్చి 2వ తేదీ న రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సు లో పేర్కొన్న సవరణల నే బిల్లు లో ప్రతిపాదించడం జరిగింది. బిల్లు ను రాబోయే పార్లమెంట్ సమావేశాల లో ప్రవేశపెడతారు.
ఆధార్ కార్డు ను మరింత ప్రజానుకూలం గాను, పౌరుల కు వినియోగ యోగ్యం గాను మార్చే ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరేందుకు అవకాశం ఉంది.
ప్రభావం:
వివరాలు :
సవరణ ల ప్రధానాంశాలు దిగువ విధం గా ఉన్నాయి –
పూర్వరంగం:
ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) ఆర్డినెన్సు, 2019 గుణ దోషాల ను మంత్రివర్గం 2019వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన సమావేశం లో పరిశీలించింది. రాష్ట్రపతి 2019 మార్చి 2వ తేదీ న ఆర్డినెన్సు ను ప్రకటించారు.
ఇతర అంశాల తో పాటు సర్వన్నత న్యాయస్థానం ఆదేశాలు మరియు జస్టిస్ బి.ఎన్. శ్రీ కృష్ణ (రిటైర్డ్) సంఘం సిఫారసు ల మేరకు ఆధార్ చట్టాన్ని పటిష్టం చేసేందుకు ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) ఆర్డినెన్సు, 2019 ను ఉద్దేశించడమైంది.