Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ కు ఒక ముఖ్య వ‌న‌రు కానున్న బ్లూ ఇకాన‌మి: ప‌్ర‌ధాన మంత్రి

‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ కు ఒక ముఖ్య వ‌న‌రు కానున్న బ్లూ ఇకాన‌మి: ప‌్ర‌ధాన మంత్రి


కోస్తా తీర ప్రాంతాల అభివృద్ధి తో పాటు క‌ష్టించి ప‌నిచేసే మ‌త్స్య‌కారుల సంక్షేమం ప్ర‌భుత్వ ముఖ్య ప్రాధమ్యాల‌ లో ఒక‌టిగా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  కోస్తా తీర ప్రాంత అభివృద్ధి కోసం ఒక బ‌హుముఖీన ప్ర‌ణాళిక‌ ను గురించి ఆయ‌న వివ‌రించారు.  దీనిలో బ్లూ ఇకానమి రూపురేఖ‌ల‌ను మార్చ‌డం, కోస్తా తీర ప్రాంతాల‌లో మౌలిక స‌దుపాయాలను మెరుగుప‌ర‌చ‌డం, స‌ముద్ర సంబంధి ఇకోసిస్ట‌మ్ ను ప‌రిర‌క్షించ‌డం వంటివి భాగం గా ఉన్నాయి.  ఆయ‌న కొచ్చి – మంగ‌ళూరు స‌హ‌జ వాయువు  గొట్ట‌పు మార్గాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు ఈ రోజు న అంకితం చేసి, ఆ త‌రువాత ఆ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ప్ర‌ధాన మంత్రి కోస్తా తీర ప్రాంత రాష్ట్రాలు రెంటి ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూనే, శీఘ్ర‌త‌ర‌మైన‌టువంటి, స‌మ‌తుల్య‌మైన‌టువంటి కోస్తా తీర ప్రాంత అభివృద్ధి తాలూకు త‌న దృష్టి కోణాన్ని గురించి కూడా సుదీర్ఘం గా వివరించారు.  క‌ర్నాట‌క‌, కేర‌ళ ల‌తో పాటు ద‌క్షిణ భార‌త‌దేశం లోని ఇత‌ర కోస్తా తీర ప్రాంత రాష్ట్రాల‌లో ‘బ్లూ ఇకాన‌మి’ ని అభివృద్ధి చేసేందుకు ఒక విపుల ప్ర‌ణాళిక అమలులో ఉంద‌ని ఆయ‌న అన్నారు.  బ్లూ ఇకాన‌మి ‘ఆత్మనిర్భ‌ర్ భార‌త్’ తాలూకు ఒక ముఖ్య వ‌న‌రు కానుంద‌ని ఆయ‌న తెలిపారు.  బ‌హుళ విధ సంధానానికి అనువైనవిగా నౌకాశ్ర‌యాల‌ను, కోస్తా తీర ప్రాంత ర‌హ‌దారుల‌ను తీర్చిదిద్ద‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు.  మేము మ‌న కోస్తా తీర ప్రాంతాన్ని ‘జీవించ‌డంలో సౌల‌భ్యం’, ‘వ్యాపారం చేయ‌డంలో సౌల‌భ్యం’ ల తాలూకు ఒక ఆద‌ర్శ న‌మూనా గా తీర్చిదిద్దాలి అనే ధ్యేయం తో ప‌ని చేస్తున్నాం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కోస్తా తీర ప్రాంతాల‌లోని మ‌త్స్య‌కార స‌ముదాయాలు సాగ‌ర సంబంధిత సంప‌ద పైన ఆధార‌ప‌డి ఉండ‌టం ఒక్క‌టే కాకుండా ఆ సంప‌ద కు వారు సంర‌క్షకులు గా కూడా ఉన్నారు అని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  దీనికి గాను, ప్ర‌భుత్వం కోస్ట‌ల్ ఇకో సిస్ట‌మ్ ను ప‌రిర‌క్షించ‌డానికి, సుసంప‌న్నం చేయ‌డానికి అనేక చ‌ర్య‌ల‌ను తీసుకొంది అని ఆయ‌న చెప్పారు.  స‌ముద్రం లో మ‌రింత లోప‌లకు పోయి చేప‌లను ప‌ట్ట‌ుకోవడం కోసం మ‌త్స్య‌కారుల‌కు సాయప‌డ‌టం, ప్రత్యేకంగా ఒక ఫిష‌రీస్ డిపార్టుమెంటు ను ఏర్పాటు చేయ‌డం, చేప‌లు/రొయ్య‌ల పెంపకం లో నిమ‌గ్న‌మైన‌ వారికి ‘కిసాన్ క్రెడిట్ కార్డుల‌’ను, చౌక రుణాల‌ను అందించ‌డం వంటి చ‌ర్య‌ లు మ‌త్స్య‌కారుల‌తో పాటు న‌వ పారిశ్రామికుల‌కు కూడా తోడ్ప‌డుతూ ఉన్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇటీవ‌లే ప్రారంభించిన ఇరవై వేల కోట్ల ‘మ‌త్స్య సంప‌ద యోజ‌న’ కేర‌ళ లో, క‌ర్నాట‌క లో ల‌క్ష‌ల కొద్దీ మ‌త్స్య‌కారుల ‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నాన్ని అంద‌జేస్తుంద‌ని కూడా ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌ కు సంబంధించిన ఎగుమ‌తుల‌ లో భార‌త‌దేశం శ‌ర‌వేగం గా ముందుకుపోతోంద‌ని ఆయ‌న అన్నారు.  నాణ్య‌మైన శుద్ధి చేసినటువంటి స‌ముద్ర ఆహార ఉత్ప‌త్తుల కేంద్రం గా భార‌త‌దేశాన్ని తీర్చిదిద్ద‌డానికి అన్ని చ‌ర్య‌లను తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  సీవీడ్ ఫార్మింగ్ దిశ‌ లో రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్న నేపథ్యం లో,  అంత‌కంత‌కు పెరుగుతు‌న్న సీవీడ్ గిరాకీ ని తీర్చ‌డం లో భార‌త‌దేశం ఒక ప్ర‌ధాన‌ భూమిక‌ ను నిర్వ‌హిస్తుందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

Narendra Modi
@narendramodi
One of our important priorities is the development of our coastal areas and welfare of hardworking fishermen.

We are working towards:

Transforming the blue economy.

Improve coastal infra.

Protecting the marine ecosystem. #UrjaAatmanirbharta

https://twitter.com/i/status/1346405954984833027

4:09 PM · Jan 5, 2021
1.9K
651 people are Tweeting about this

 

***