Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన (ఎ.బి.ఆర్.వై)కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


సంఘటితరంగంలో ఉపాధి కల్పనకు ప్రోత్సాహం ఇవ్వడానికి కోవిడ్ నుంచి కోలుకొనే కాలంలో కొత్తఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రోత్సాహకాలను ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 లో భాగంగా ‘‘ఆత్మనిర్భర్భారత్ రోజ్‌గార్ యోజన’’ (ఎ.బి.ఆర్.వై.) ని అమలు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతఆర్థిక సంవత్సరానికి 1,584 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు 2020-2023 మధ్య ఈ పథకంఅమలయ్యే కాలానికి గాను 2,810 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు మంత్రివర్గంఆమోదముద్రవేసింది.

ఈ పథకం ముఖ్యాంశాలు ఈ క్రింద తెలిపినవిధంగా వున్నారు:

  1. 2020 అక్టోబర్ 1వ తేదీ నాడు గానీ లేదా ఆ తర్వాతగానీ పనిలోకి తీసుకున్న కొత్త ఉద్యోగుల విషయంలోనూ, 2021 జూన్ 30 వరకు తీసుకొన్నఉద్యోగుల విషయంలోనూ భారత ప్రభుత్వం 2 సంవత్సరాల సబ్సిడీని అందిస్తుంది.
  2. భారత ప్రభుత్వం ఇటు 12% ఉద్యోగుల చందాను, అటు 12%యాజమాన్య సంస్థల చందాను.. అంటే వేతనాలలో 24 శాతాన్ని ఈ.పీ.ఎఫ్. రూపంలో చెల్లిస్తుంది;ఇది వేయి మంది వరకు ఉద్యోగులు పనిచేసే సంస్థలలో కొత్త ఉద్యోగులకు 2 సంవత్సరాలకాలానికి వర్తిస్తుంది. వేయి మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న వ్యాపారసంస్థలలోని కొత్త ఉద్యోగుల విషయంలో కేవలం ఉద్యోగి తాలూకు ఈ.పి.ఎఫ్. ఛందాను అంటేవేతనాలలో 12 % భారత ప్రభుత్వం రెండేళ్లపాటు చెల్లిస్తుంది. 15,000 రూపాయల కంటే తక్కువ నెలవారి వేతనాన్నిపొందుతున్న ఉద్యోగి ఎవరైతే ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈ.పి.ఎఫ్.వో.లో 2020అక్టోబర్ 1వ తేదీకి ముందుగా నమోదు అయి వుంటే, ఆ వ్యక్తికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ఏదీ లేకపోతే, లేదా 2020 అక్టోబర్ 1వ తేదీకి ముందు ఈ.పి.ఎఫ్. సభ్యత్వ ఖాతా సంఖ్యఏదీ లేకపోతే ఈ ప్రయోజనానికి అర్హత లభిస్తుంది.
  3. యూనివర్సల్ అకౌంట్ నంబర్ యు.ఎ.ఎన్. ను కలిగివున్న ఈ.పి.ఎఫ్. సభ్యులు ఎవరైనా నెలకు 15,000 రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతూకోవిడ్ మహమ్మారి కారణంగా 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య కాలంలోఉపాధికి దూరం అయినప్పుడు, అలాగే 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ.పి.ఎఫ్. సదుపాయం గలసంస్థలో ఉద్యోగంలో చేరకపోయినట్లయితే అటువంటి వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందేందుకుఅర్హులు అవుతారు.
  4. ఛందా సొమ్మును ఆధార్ సీడింగ్ జరిగిన సభ్యులఅకౌంట్‌లో ఎలక్ట్రానిక్ పద్దతిలో ఈ.పి.ఎఫ్.వో. జమ చేస్తుంది.
  5. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక సాప్ట్‌వేర్ నుఈ.పి.ఎఫ్.వో. రూపొందిస్తోంది. అంతేకాకుండా ఒక పారదర్శకత కలిగిన బాధ్యతాయుతమైనప్రక్రియను తానే అభివృద్ధిపరుస్తుంది.
  6. ఎ.బి.ఆర్.వై.లో భాగంగా అందించే ప్రయోజనాలుఈ.పి.ఎఫ్.వో. అమలు చేసే మరేదైనా పథకం ప్రయోజనాలు ఏ విధంగా కూడా కలసిపోకుండాఉండేందుకు ఒక విధివిధానాన్ని ఈ.పి.ఎఫ్.వో. రూపొందించవలసి వుంటుంది.

****