Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆత్మనిర్భర్ భారత్ ఇనొవేశన్ చాలెంజ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


పౌరులు ఇప్పటికే వినియోగిస్తున్న భారతీయ ఏప్ లను మరియు వాటి వాటి కేటగిరిల లో ప్రపంచ శ్రేణి ఏప్ లు గా ఎదగగలిగే భారతీయ ఏప్ లను గుర్తించడం కోసం ఉద్దేశించిన ‘ఆత్మనిర్భర్ భారత్ ఇనొవేశన్ చాలెంజ్’ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

‘‘ప్రపంచ శ్రేణి ఏప్ లు గా ఎదగగలిగే మేక్ ఇన్ ఇండియా ఏప్ లను సృజించడం కోసం టెక్ సముదాయం లో మరియు స్టార్ట్- అప్ సముదాయం లో ఈ రోజు న గొప్ప ఉత్సుకత తొణికిసలాడుతున్నది. వారి ఆలోచనల కు మరియు ఉత్పత్తుల కు మార్గాన్ని సుగమం చేయడం కోసం GoI_MeitY , ఇంకా @AIMtoInnovate లు ‘ఆత్మనిర్భర్ భారత్ ఇనొవేశన్ చాలెంజ్’ ను ప్రారంభిస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.