ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను, ఆ కార్యక్రమం తో సంబంధం గల వారి తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం అక్టోబర్ 23 న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా చర్చించనున్నారు. చర్చ అనంతరం ఆయన ప్రసంగిస్తారు.
ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కారం కోసం ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు ద్వారా స్ఫూర్తి ని పొంది స్వయంపూర్ణ గోవా కార్యక్రమాన్ని 2020 వ సంవత్సరం లో అక్టోబర్ 1వ తేదీ న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగం గా, రాష్ట్ర ప్రభుత్వం లో ఓ అధికారి ని ‘స్వయంపూర్ణ మిత్ర’ గా నియమించారు. ఈ ‘మిత్ర’ తనకు కేటాయించిన పంచాయతీ ని గాని, లేదా పురపాలక సంఘాన్ని గాని సందర్శించి అక్కడి ప్రజల తో మాట్లాడి, పలు ప్రభుత్వ విభాగాల తో సమన్వయాన్ని సైతం నెలకొల్పుతారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలు అర్హత కలిగిన లబ్ధిదారుల కు అందేటట్లు చూస్తారు.
గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.
***