Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆటబొమ్మల తయారీలో మన పురోగతి స్వయం సమృద్ది సాధన దిశగా మనం చేస్తున్న కృషికి ఊతాన్నిచ్చింది.. దేశ సంప్రదాయాలకు, వ్యాపారానికి ప్రజాదరణను తెచ్చిపెట్టింది: ప్రధాని


ఆట వస్తువుల తయారీ రంగంలో ప్రభుత్వం వేసిన ముందడుగులు  స్వయంసమృద్ధి సాధన దిశలో దేశం చేస్తున్న కృషికి దన్నుగా నిలవడంతోపాటు మన దేశ సంప్రదాయాలకు, వ్యాపారానికి చక్కని ప్రజాదరణ లభించేటట్లు చేశాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమానికి సంబంధించిన అప్‌డేట్స్ హ్యాండిల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి ఆయన ప్రతిస్పందిస్తూ ఇలా రాశారు:
‘‘బొమ్మల తయారీని ప్రోత్సహించాలని #MannKiBaat (మనసులో మాట) కార్యక్రమంలో ఓ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం. దేశమంతటా ఉమ్మడి ప్రయత్నాలు చేపట్టడం ద్వారా ఈ మార్గంలో మనం ఇప్పటికి చాలా ముందుకు సాగిపోయాం.

ఈ రంగంలో మనం సాధించిన పురోగతి మన దేశాన్ని స్వయంసమృద్ధి బాటలో నడిపించాలనే మన తపనను మరింత పెంచడంతోపాటు భారతదేశ సంప్రదాయాలకు, వ్యాపారానికి ప్రజాదరణను కూడా సంపాదించిపెట్టింది.’’