ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అంటే, ఈ నెల 12న అహమదాబాద్ లోని సాబర్మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర) కు పచ్చజెండా ను చూపనున్నారు. అలాగే ఆయన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) తాలూకు ఆది కార్యకలాపాల ను కూడా ప్రారంభిస్తారు. India@75 ఉత్సవాల కై ఉద్దేశించినటువంటి ఇతర వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను సైతం ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సాబర్మతీ ఆశ్రమం లో ఒక సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 10:30 గంటల కు మొదలయ్యే ఈ కార్యక్రమం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ లతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ కూడా పాల్గొననున్నారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనేది భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరాలు కావడాన్ని స్మరించుకొనేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల శ్రేణి కి పెట్టిన పేరు. ఈ మహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్య ప్రేరణ తో ఒక జన ఉత్సవం వలె నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవం లో భాగం గా అనుసరించవలసిన విధానాల ను, జరపవలసిన వివిధ కార్యక్రమాల ను రూపొందించడానికి ఒక జాతీయ అమలు సంఘాన్ని దేశీయ వ్యవహారాల మంత్రి నాయకత్వం లో నియమించడం జరిగింది. దీనిలోని ఆది కార్యక్రమాల ను 2022వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ కన్నా 75 వారాలు ముందుగానే ఈ నెల 12 నుంచే మొదలు పెట్టబోతున్నారు.
పాదయాత్ర
పాదయాత్ర కు ప్రారంభ సూచకం గా ఒక పచ్చజెండా ను ప్రధాన మంత్రి చూపనున్నారు. 81 మంది యాత్ర లో పాల్గొనే వారు అహమదాబాద్ లోని సాబర్మతీ ఆశ్రమం నుంచి నవ్ సారీ లోని దండి వద్దకు 241 మైళ్ళ దూరం ప్రయాణించనున్నారు. ఈ యాత్ర 25 రోజుల పాటు సాగి ఏప్రిల్ 5న ముగుస్తుంది. ఈ పాదయాత్ర దండి కి వెళ్ళే క్రమం లో వివిధ ప్రజా సమూహాలు దీనితో జత పడుతాయి. పాదయాత్ర లో 75 కిలో మీటర్ల ఒకటో అంకాని కి కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ సారథ్యం వహిస్తారు.
India@75 లో భాగం గా చేపట్టే ఆది కార్యక్రమాలు
ఈ కార్యక్రమం లో భాగం గా India@75 ఇతివృత్తం తో ఉండే ఆది కార్యకలాపాల ను మొదలుపెడతారు. ఒక చిత్రం, వెబ్ సైట్, గేయం, ఆత్మనిర్భర్ చరఖా తో పాటు ఆత్మనిర్భర్ ఇన్క్యుబేటర్ లు ఈ కార్యకలాపాల లో ఉంటాయి.
పైన ప్రస్తావించిన కార్యక్రమాల తో పాటు దేశ అజేయ స్ఫూర్తి ని కీర్తించే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సంగీతం, నృత్యం, పఠనం, పీఠిక ను చదవడం ( ఈ సందర్భం లో ప్రతి పంక్తి ని దేశం లోని వేరు వేరు ప్రాంతాల కు ప్రాతినిధ్యం వహించే విభిన్న భాష లో వల్లిస్తారు) వంటివి భాగంగా ఉంటాయి. యువత శక్తి ని భారతదేశం తాలూకు భవిత గా అభివర్ణిస్తూ 75 గళాలు బృంద గానం లో పాలుపంచుకొంటాయి; అలాగే 75 మంది నృత్య కళాకారులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటారు.
రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కూడా భారతదేశం అంతటా ఈ నెల 12న కార్యక్రమాల ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల కు తోడు భారతీయ పురాతత్వ సర్వేక్షణ్ (ఎఎస్ఐ), సంస్కృతి మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టిఆర్ఐఎఫ్ఇడి ల పరిధి లోని మండల సాంస్కృతిక కేంద్రాలు ఈ సందర్భం లో వివిధ కార్యకలాపాల ను జరప తలపెట్టాయి.
***
12th March is a special day in India’s glorious history. On that day in 1930, the iconic Dandi March led by Mahatma Gandhi began. Tomorrow, from Sabarmati Ashram we will commence Azadi Ka Amrut Mahotsav, to mark 75 years since Independence. https://t.co/8E4TUHaxlo
— Narendra Modi (@narendramodi) March 11, 2021