ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త ఆచార్య యశ్ పాల్ కన్నుమూత పట్ల విచారం వ్యక్తం చేశారు.
‘‘ ప్రొఫెసర్ యశ్ పాల్ మరణం నాకు వేదనను కలిగించింది. మనం సూక్ష్మబుద్ధి గల ఒక శాస్త్రవేత్త ను మరియు భారతదేశ విద్యారంగానికి చిరస్థాయి సేవలను అందించినటువంటి విద్యావేత్తను కోల్పోయాము.
2009 లో గుజరాత్ లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ తో సహా పలు సందర్బాలలో ఆచార్య యశ్ పాల్ తో సంభాషించే భాగ్యం నాకు దక్కింది ’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
2009 లో గుజరాత్ లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఆచార్య యశ్ పాల్ తో తాను కలసి ఉన్న కొన్ని ఛాయాచిత్రాలను కూడా ప్రధాన మంత్రి పంచుకొన్నారు.
Pained by Professor Yash Pal's demise. We have lost a brilliant scientist & academician who made a lasting contribution to Indian education.
— Narendra Modi (@narendramodi) July 25, 2017
Interacted with Professor Yash Pal extensively on many occasions including the National Children’s Science Congress in Gujarat in 2009. pic.twitter.com/nkUlgFRUNK
— Narendra Modi (@narendramodi) July 25, 2017