Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆగ‌స్టు 15వ తేదీన త‌న ఉప‌న్యాసం కోసం ఆలోచనలను ఆహ్వానించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2017 ఆగ‌స్టు 15వ తేదీ నాడు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఇవ్వ‌నున్న ప్ర‌సంగం కోసం ఆలోచ‌న‌ల‌ను ఆహ్వానించారు. దేశ ప్రజలు వారి ఆలోచ‌న‌ల‌ను Narendra Modi App లో ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఒక ఓపెన్ ఫోర‌మ్ పై పంచుకోవాలంటూ ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

“పంద్రాగ‌స్టు నాడు ఎర్ర‌ కోట బురుజుల మీద నుండి నేను దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించేట‌ప్పుడు, నేను కేవలం ఒక సాధ‌నాన్ని. ఆ గళం 125 కోట్ల మంది భార‌తీయులది.

స్వాతంత్య్ర దిన ఉప‌న్యాసం కోసం మీ మ‌దిలో త‌ట్టిన ఆలోచ‌న‌ల‌ను ఎన్ఎమ్ యాప్‌ లోని http://nm4.in/dnldapp లో ప్రత్యేకంగా ఏర్పాటైన ఓపెన్ ఫోర‌మ్ లో పంచుకోండి” అని ప్ర‌ధాన మంత్రి కోరారు.