Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆగస్ట్ 25న నిర్వహించే అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ కార్మిక సదస్సులో వర్చువల్ గా ప్రసంగించనున్న ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఆగస్టు, 2022 సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంగా  అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రులకై ఉద్దేశించిన  జాతీయ సదస్సులో ప్రసంగిస్తారు. రెండు రోజుల సదస్సును కేంద్ర కార్మిక,  ఉపాధి మంత్రిత్వ శాఖ ఆగస్టు2022లో   25-26 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో నిర్వహిస్తోంది.

వివిధ ముఖ్యమైన కార్మిక సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తితో  సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. మెరుగైన విధానాలను రూపొందించడంలో కార్మికుల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయాన్ని సృష్టించేందుకు  సమావేశం  సహాయపడుతుంది.

సామాజిక రక్షణను సర్వత్రా అమలు చేయడానికి ఆన్బోర్డింగ్ సామాజిక భద్రతా పథకాల కోసం శ్రామ్ పోర్టల్ను ఏకీకృతం చేయడంకై ఉద్దేశించిన సమావేశం  నాలుగు ఇతివృత్త  అంకాలను కలిగి ఉంటుంది; రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం కింద నిర్వహించే ESI ఆసుపత్రుల ద్వారా వైద్య సంరక్షణను మెరుగుపరచడం, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన– PMJAYతో ఏకీకరణ కోసంస్వాస్థ్య సే సమృద్ధి’; నాలుగు లేబర్ కోడ్ క్రింద నియమాలను రూపొందించడం వాటి అమలు కోసం పద్ధతులు ఏర్పరచడం ; విజన్ శ్రమేవ్ జయతే @ 2047 పనికి  న్యాయమైన సమానమైన పరిస్థితులు, అసంఘటిత కూలీలు, ప్లాట్ఫారమ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ సామాజిక రక్షణ, పనిలో లింగ సమానత్వం వంటి  ఇతర సమస్యలపై దృష్టి సారిస్తుంది.

 

****