గుజరాత్ లోని వల్ సాడ్ జిల్లాలో శ్రీమద్ రాజ్ చంద్ర మిశన్, ధరంపుర్ లో కు చెందిన వివిధ ప్రాజెక్టుల లో కొన్నిటిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 4వ తేదీ న సాయంత్రం నాలుగున్నర గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించడం తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయనున్నారు.
వల్ సాడ్ లోని ధరంపుర్ లో శ్రీమద్ రాజ్ చంద్ర ఆసుపత్రి ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు అంతటికి కలిపి సుమారు 200 కోట్లు ఖర్చు అయింది. ఇది 250 పడకల సామర్థ్యం కలిగిన మల్టి స్పెశాలిటి హాస్పిటల్. దీని లో అత్యధునాతనమైనటువంటి వైద్య సంబంధి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అవి ప్రపంచ శ్రేణి తృతీయ స్థాయికి చెందిన వైద్య చికిత్సల ను అందించగలవు; ప్రత్యేకించి గుజరాత్ లోని దక్షిణ ప్రాంత ప్రజల కు దీని వల్ల ప్రయోజనం సిద్ధించనుంది.
శ్రీమద్ రాజ్ చంద్ర ఏనిమల్ హాస్పిటల్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 150 పడకల సదుపాయం కలిగివుండేటటువంటి ఈ ఆసుపత్రి ని ఇంచుమించు 70 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. ఈ ఆసుపత్రి కి అగ్ర శ్రేణి సదుపాయాల ను సమకూర్చడం తో పాటుగా పశు వైద్యులు మరియు అనుబంధ సిబ్బంది తో కూడిన ఒక జట్టు ను ప్రత్యేకం గా సమకూర్చనున్నారు. ఈ ఆసుపత్రి పశువుల పోషణ కు మరియు సంరక్షణ కు అటు సాంప్రదాయిక వైద్యాన్ని, ఇటు సమగ్రమైన చికిత్సల ను కూడా అందిస్తుంది.
ఇదే కార్యక్రమం లో భాగం గా శ్రీమద్ రాజ్ చంద్ర సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫార్ విమెన్ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనిని 40 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. దీనిలో వినోద కార్యక్రమాల కు ఉద్దేశించిన సదుపాయాలు, స్వీయ వికాసం సంబంధి సమావేశాల కు తరగతి గదులు, విశ్రాంతి ప్రదేశాలు ఉంటాయి. దీనిలో 700కు పైగా ఆదివాసి మహిళల ను నియమించుకోవడం జరుగుతుంది; అంతేకాక తరువాత తరువాత వేల మంది కి ఈ కేంద్రం ఉపాధి ని అందిస్తుంది.
***