Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆగస్టు 27 వ తేదీనాడు బి-20 సమిట్ ఇండియా 2023 ను ఉద్దేశించి ప్రసంగించనున్నప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో 2023 ఆగస్టు 27 వ తేదీ నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ కు బి20 సమిట్ ఇండియా 2023 ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

బి-20 సమిట్ ఇండియా ప్రపంచవ్యాప్తం గా ఉన్న విధాన రూపకర్తల ను, వ్యాపార రంగ ప్రముఖుల ను మరియు నిపుణుల ను బి-20 ఇండియా కమ్యూనికే ను గురించి చర్చోపచర్చలు చేయడం కోసం ఒక చోటు కు తీసుకు వస్తున్నది. బి-20 ఇండియా కమ్యూనిక్ లో 54 సిఫారసుల ను మరియు 172 విధాన పరమైన కార్యాచరణల ను జి-20 కి నివేదించడం జరుగుతుంది.

 

బిజినెస్ 20 (బి20) ని ప్రపంచ వ్యాపార సముదాయం తో జత పడ్డ జి-20 యొక్క ఆధికారిక సంభాషణ లకు వేదిక. దీనిని 2010 వ సంవత్సరం లో స్థాపించడమైంది. జి-20 లో అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఎంగేజ్ మెంట్ గ్రూప్స్ లో బి-20 ఒకటి. దీనిలో పాలుపంచుకొనేవాటి లో కంపెనీ లు మరియు వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆర్థిక వృద్ధి ని మరియు అభివృద్ధి ని ప్రోత్సహించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రధానమైనటువంటి విధానాల ను బి20 సిఫారసు చేస్తూ ఉంటుంది.

 

ఈ శిఖర సమ్మేళనాన్ని మూడు రోజుల పాటు, అంటే ఆగస్టు 25 మొదలుకొని 27 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతున్నది. ఆర్.ఎ.ఐ.ఎస్.ఇ అనేది ఈ కార్యక్రమం యొక్క ఇతి వృత్తం గా ఉంది. ఆర్.ఎ.ఐ.ఎస్.ఇ లోని అక్షరాలు వరుస గా – రెస్పాన్సిబుల్, ఏక్సెలరేటెడ్, ఇనొవేటివ్, సస్ టేనబుల్ ఎండ్ ఎక్విటేబుల్ బిజినెసస్ అనే పదాల ను సూచిస్తాయి. దాదాపు గా 55 దేశాల కు చెందిన 1500 మంది కి పైగా ప్రతినిధులు ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొంటున్నారు.

 

***