Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.

 

ఆకలి, పేదరికం.. వీటిని పరిష్కరించడానికి భారతదేశం చేపట్టిన కార్యక్రమాలను ప్రధానమంత్రి వివరిస్తూ, భారతదేశం గత పది సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చిందని, దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చిందన్నారు. ఆహార భద్రతను కల్పించడంలో భారతదేశం సాధించిన సాఫల్యాల గురించి ప్రధాని చెబుతూ.. భారత్ అనుసరించిన విధానం ‘మూలాల్లోకి తిరిగి వెళ్ళడంతో పాటు, భవిష్యత్తుకేసి సాగిపోవడం’ అనే అంశాలపై ఆధారపడిందని అన్నారు. మహిళలకు ప్రధాన భూమికను అప్పగిస్తూ అభివృద్ధిని సాధించడానికి భారతదేశం తీసుకొన్న చర్యలను సైతం సభకు ఆయన వివరించారు.   

ఆఫ్రికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఆహార భద్రతను పెంచడానికి భారతదేశం తీసుకొన్న చర్యలను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన, ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక భౌగోళిక కూటమిని ఏర్పాటు చేసేందుకు బ్రెజిల్ నడుం బిగించడాన్ని స్వాగతించారు. ప్రస్తుతం ప్రపంచంలో పలు ప్రాంతాలలో పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో తలెత్తిన ఆహార, ఇంధన, ఎరువుల సంబంధిత సంక్షోభాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైన తీవ్ర ప్రభావాన్ని కలుగజేశాయి. ఈ కారణంగా ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం తప్పనిసరి అని ప్రధాని అన్నారు.

ప్రధాని ప్రసంగం కోసం here.