Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్రైలు దుర్ఘటన ను గురించి కేంద్ర రైల్ వే మంత్రి శ్రీ అశ్వినివైష్ణవ్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి


ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన రైలు దుర్ఘటన ను గురించి కేంద్ర రైల్ వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. అలమండ మరియు కంటకాపల్లి సెక్శన్ మధ్య మార్గం లో రైలు దురదృష్టవశాత్తు పట్టాలు తప్పిన దుర్ఘటన దరిమిలా తలెత్తిన స్థితి ని గురించి శ్రీ నరేంద్ర మోదీ మంత్రి ని అడిగి తెలుసుకొన్నారు.

మృతుల కుటుంబాల కు శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలంటూ ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు.

మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుందని కూడాను ప్రధాన మంత్రి ప్రకటించారు. అదే విధం గా, రైలు ప్రమాదం లో గాయపడిన వారి కి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi రైల్ వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw తో మాట్లాడి, అలమండ మరియు కంటకాపల్లి సెక్శన్ మధ్య మార్గం లో రైలు దురదృష్టవశాత్తు పట్టాల ను తప్పడం వల్ల ఏర్పడ్డ స్థితి ని గురించి అడిగి తెలుసుకొన్నారు.

బాధిత వ్యక్తుల కు అధికారులు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని సమకూర్చుతున్నారు. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు సంతాపాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేయడం తో పాటు గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.

అలమండ మరియు కంటకాపల్లి సెక్శను మధ్య రైలు పట్టాలు తప్పిన ఘటన లో మరణించిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి చెల్లించడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు. గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.