Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థనకార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థనకార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. నూట నలభై కోట్ల మంది భారతదేశం ప్రజల కు మంచి ఆరోగ్యం, శ్రేయం మరియు సమృద్ధి కలగడం కోసం భగవాన్ వేంకటేశ్వర స్వామి వారి దీవెనల కై ప్రధాన మంత్రి వేడుకొన్నారు. తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తాలూకు దృశ్యాల ను కొన్నింటిని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో :

‘‘తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో, భారతదేశం లోని 140 కోట్ల మంది దేశవాసుల కు మంచి ఆరోగ్యం, శ్రేయం మరియు సమృద్ధి కలగడం కోసం భగవాన్ వేంకటేశ్వర స్వామి వారి దీవెన లు ప్రాప్తించాలంటూ వేడుకొన్నాను.’’ అని ఒక పోస్టు లో పేర్కొన్నారు.