Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహ‌మ‌దాబాద్ లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019 సంద‌ర్భం గా ఉజ్‌బెకిస్తాన్ అధ్య‌క్షుని తో ప్రధాన మంత్రి భేటీ

అహ‌మ‌దాబాద్ లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019 సంద‌ర్భం గా ఉజ్‌బెకిస్తాన్ అధ్య‌క్షుని తో ప్రధాన మంత్రి భేటీ

అహ‌మ‌దాబాద్ లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019 సంద‌ర్భం గా ఉజ్‌బెకిస్తాన్ అధ్య‌క్షుని తో ప్రధాన మంత్రి భేటీ


‘‘వైబ్రంట్ గుజ‌రాత్ గ్లోబ‌ల్ స‌మిట్-2019’’ సంద‌ర్భం గా జ‌న‌వ‌రి 18 వ తేదీ న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు ఉజ్‌బెకిస్తాన్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ శౌకత్ మిర్జియోయెవ్ లు పాక్షిక స‌మావేశం లో పాలుపంచుకున్నారు.  అంత‌క్రితం జ‌న‌వ‌రి 17 వ తేదీ నాడు అధ్య‌క్షుడు శ్రీ మిర్జియోయెవ్ పెద్ద సంఖ్య లో ఉన్న‌తాధికారులతో కూడిన పెద్ద ప్ర‌తినిధివ‌ర్గానికి  నాయ‌క‌త్వం వ‌హించి గాంధీన‌గ‌ర్ కు త‌ర‌లి రాగా వారి కి గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఒ.పి. కోహ్లీ స్వాగ‌తం ప‌లికారు.

ద్వైపాక్షిక స‌మావేశం సందర్భం గా అధ్య‌క్షుడు శ్రీ మిర్జియోయెవ్ కు మ‌రియు ఆయ‌న ప్ర‌తినిధివ‌ర్గాని కి గుజ‌రాత్ లోకి ప్ర‌ధాన మంత్రి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.  అధ్య‌క్షుడు శ్రీ మిర్జియోయెవ్ 2018వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 30వ తేదీ న మ‌రియు అదే సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 1 వ తేదీ న భార‌త‌దేశం లో ఆధికారిక ప‌ర్య‌ట‌న కు వ‌చ్చిన‌పుడు చోటు చేసుకొన్న త‌మ ఇరువురి భేటీ ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొని ఆ సంద‌ర్భం లో తీసుకొన్న వివిధ నిర్ణ‌యాల ను అమ‌లు చేయడం లో నమోదైన పురోగ‌తి ప‌ట్ల త‌న సంతృప్తి ని వ్య‌క్తం చేశారు.  ఆ వేళ గుజ‌రాత్ కు మ‌రియు ఉజ్‌బెకిస్తాన్ లోని ఆందిజాన్ ప్రాంతాని కి మ‌ధ్య స‌హ‌కారం అంశం పై ఎంఒయు కుదిరిన సంగ‌తి ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ఉజ్‌బెక్ ప్ర‌తినిధి వ‌ర్గం లో ఒక‌రు గా ఆందిజాన్ ప్రాంత గ‌వ‌ర్న‌ర్ కూడా విచ్చేసినందుకు హ‌ర్షాన్ని వ్యక్తం చేశారు.  అధ్య‌క్షుడు శ్రీ మిర్జియోయెవ్ ప‌ర్య‌ట‌న ఫ‌లితం గా ఉజ్‌బెకిస్తాన్ కు, భార‌త‌దేశాని కి మ‌ధ్య గల సంబంధాలతో పాటు గుజ‌రాత్ కు, ఆందిజాన్ కు మ‌ధ్య ప్రాంతం వారీ స‌హ‌కారం కూడా మ‌రింత బ‌లోపేతం కాగలద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

2019వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 12వ‌, 13వ తేదీ ల‌లో ఉజ్‌బెకిస్తాన్ లోని స‌మ‌ర్‌కండ్ లో ఫస్ట్ ఇండియా- సెంట్రల్ ఏశియా డైలాగ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రుల స్థాయి లో జరుగగా, ఆ  స‌మావేశాని కి అధ్య‌క్షుడు శ్రీ మిర్జియోయెవ్ అందించిన మ‌ద్ద‌తు కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.  ఆ స‌మావేశం లో అఫ్గానిస్తాన్ లో శాంతి కి, మరియు అభివృద్ధి కి అండ‌ గా నిల‌బ‌డటం కోసం ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌ ను తీసుకోవ‌డం జరిగింది.

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ లో పాలుపంచుకోవ‌లసిందంటూ ఆహ్వానించినందుకు ప్ర‌ధాన మంత్రి కి అధ్య‌క్షుడు శ్రీ శౌక‌త్ మిర్జియోయెవ్ ధ‌న్యావాదాలు తెలిపారు.  భార‌త‌దేశం నుండి పెట్టుబ‌డుల‌ ను ఆక‌ర్షించటానికి ఉజ్‌బెకిస్తాన్ అగ్ర ప్రాధాన్యాన్ని క‌ట్ట‌బెడుతోందని ప్ర‌ధాన మంత్రి కి ఆయన తెలియజేశారు.  భార‌తదేశం తో ఉజ్‌బెకిస్తాన్ భావి స‌హ‌కారం లో ఐటి, విద్య‌, ఫార్మస్యూటిక‌ల్స్‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, వ్య‌వ‌సాయ సంబంధ వ్యాపారం ల‌తో పాటు ప‌ర్య‌ట‌న రంగం వంటివి కొన్ని ప్రాధాన్య రంగాలుగా ఉంటాయ‌ని ఆయ‌న అన్నారు.

ఫస్ట్ ఇండియా- సెంట్రల్ ఏశియా డైలాగ్ లో విజ‌య‌వంత‌మైన ఫ‌లితాలు రావ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి ని అధ్య‌క్షుడు శ్రీ మిర్జియోయెవ్ అభినందించారు.  మ‌ధ్య ఆసియా ప్రాంతం లో భార‌త‌దేశం క‌న‌బ‌రుస్తున్న‌టువంటి స‌కారాత్మ‌క‌మైన ప్ర‌భావాన్ని ఈ ప‌రిణామం నిరూపించింద‌ని, అంతేకాక‌ అఫ్గానిస్తాన్ లో శాంతి సాధన కు ప‌లు దేశాలు ఉమ్మ‌డి గా కృషి చేస్తున్నాయని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశం యొక్క శ‌క్తి సంబ‌ధిత అవ‌స‌రాల కోసం యురేనియం ఓర్ కాన్‌సెంట్రేట్ ను దీర్ఘ‌కాల ప్రాతిప‌దిక‌ న స‌ర‌ఫ‌రా చేసే అంశం లో భార‌త‌దేశాని కి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ కి, రిప‌బ్లిక్ ఆఫ్ ఉజ్‌బెకిస్తాన్  కి చెందిన నోవోయి మిన‌ర‌ల్స్ అండ్ మెటలర్జికల్ కంపెనీ కి మ‌ధ్య ఒక కాంట్రాక్టు తాలూకు ప‌త్రాల ను ఇరువురు నేత‌ల స‌మ‌క్షం లో ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రిగింది.

200 మిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల విలువ క‌లిగిన లైన్ ఆఫ్ క్రెడిట్ అంశానికి సంబంధించి ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు, రిప‌బ్లిక్ ఆఫ్ ఉజ్‌బెకిస్తాన్ ప్ర‌భుత్వాని కి మ‌ధ్య ఒక ఒప్పందం పై సంత‌కాలు జ‌ర‌గ‌డాన్ని నేత‌లు ఉభయులు స్వాగ‌తించారు.  ఉజ్‌బెకిస్తాన్ లో గృహ నిర్మాణానికి మ‌రియు సామాజిక మౌలిక స‌దుపాయాల కల్పన కు సంబంధించిన ప్రాజెక్టుల కు అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ఉద్దేశించినటువంటి ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ కు భార‌త ప్ర‌భుత్వం యొక్క మ‌ద్దతు కూడా ఉంటుంది. అధ్య‌క్షుడు శ్రీ మిర్జియోయెవ్ ఇదివరకు భారతదేశాని కి ఆధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం విచ్చేసినప్పుడు, ఉజ్‌బెకిస్తాన్ కు 200 మిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించివున్నారు.

**