Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహ్మదాబాద్ లో పుష్పాల అంతర్జాతీయ ప్రదర్శన దృశ్యాల్ని పంచుకొన్న ప్రధానమంత్రి


అహ్మదాబాద్ లో పూల అంతర్జాతీయ ప్రదర్శన దృశ్యాల్ని కొన్నిటిని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకొన్నారు. ‘ఈ ప్రదర్శనతో నాకు బలమైన అనుబంధం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రిగా నేను సేవ చేసిన కాలంలోనే ఈ ప్రదర్శన వృద్ధి చెందింది. ఈ తరహా ప్రదర్శనలు ప్రకృతి శోభను ఒక ఉత్సవంలా చాటిచెప్పడంతోపాటు చైతన్యానికీ, నిలకడతనం కలిగిన మనుగడకూ ప్రేరణగా నిలుస్తాయ’ని కూడా శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘అహ్మదాబాద్ లో పుష్పాల అంతర్జాతీయ ప్రదర్శనకు చెందిన కొన్ని దృశ్యాలు ఇవిగో, చూడండి. ఈ ప్రదర్శనతో నాకు బలమైన బంధం ఉంది, దీనికి కారణం ఏమిటంటే ముఖ్యమంత్రిగా నేను పనిచేసిన కాలంలోనే దీని వృద్ధిని నేను గమనించాను. ఇలాంటి ప్రదర్శనలు ప్రకృతి సౌందర్యాన్ని ఒక పండుగలా చేసుకోవడమే కాకుండా, భూమిపై మన మనుగడను మనం ఎలా స్థిరపరచుకోవచ్చో అనే విషయంలో ప్రేరణనిస్తాయి కూడా. ఈ ప్రదర్శనలు స్థానిక రైతులకూ, తోటల పెంపకందారులకూ, ఔత్సాహికులకూ వారి సృజనశీలతను చాటుకొనేందుకు ఓ వేదికను సైతం అందిస్తాయి.’’

‘‘అహ్మదాబాద్ అంతర్జాతీయ పూల ప్రదర్శనకు చెందిన మరికొన్ని దృశ్యాలు ఇవిగో..’’

 

***