Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహ్మదాబాద్‌ లోని బోపాల్‌ లో “ఇన్-స్పేస్” ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన – ప్రధానమంత్రి

అహ్మదాబాద్‌ లోని బోపాల్‌ లో “ఇన్-స్పేస్” ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన – ప్రధానమంత్రి


అహ్మదాబాద్‌ లోని బోపాల్‌ లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ప్రధాన కార్యాలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో “ఇన్-స్పేస్” మరియు అంతరిక్ష ఆధారిత అప్లికేషన్లు, సేవల రంగంలో పనిచేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాల మార్పిడి కూడా జరిగింది.   అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం, ప్రారంభించడం అనేది అంతరిక్ష రంగానికి పెద్ద చేయూత అందించడంతో పాటు, భారతదేశం లోని ప్రతిభావంతులైన యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది.   ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ తో పాటు అంతరిక్ష పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ, 21వ శ‌తాబ్దపు ఆధునిక భార‌త‌దేశ అభివృద్ధి ప‌ర్య‌ట‌న‌లో ఒక అద్భుత‌మైన అధ్యాయం జోడించ‌డం జరిగిందని పేర్కొన్నారు.  ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటే “ఇన్-స్పేస్” ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి దేశ ప్రజలందరికీ, శాస్త్రీయ సమాజానికి అభినందనలు తెలిపారు.  అనేక అభివృద్ధి, అవకాశాలకు నాందిగా ఉన్నందున, “ఇన్-స్పేస్” ప్రారంభం సందర్భంగా ‘ఈ స్థలాన్ని చూడండి’ అని ప్రధానమంత్రి భారత అంతరిక్ష పరిశ్రమ రంగాన్ని ఆహ్వానించారు.   భారతదేశం లోని యువత తమ ప్రతిభను భారతదేశం లోని మేధావులకు ప్రదర్శించడానికి ఇన్స్పేస్ అవకాశం కల్పిస్తుంది.   వారు ప్రభుత్వంలో లేదా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాఇన్స్పేస్ అందరికీ గొప్ప అవకాశాలను కల్పిస్తుంది.” అని ఆయన పేర్కొన్నారు.   ప్రధానమంత్రి ఇదే విషయాన్ని మరింతగా విశదీకరిస్తూ, భారత అంతరిక్ష పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేసే అవకాశం ఇన్స్పేస్ కి ఉంది.  కాబట్టి నేను కోరుతున్నాను –  స్థలాన్ని చూడండి‘.  ఇన్స్పేస్ – అంటే అంతరిక్షం కోసం;  ఇన్స్పేస్ – అంటే వేగం కోసంఇన్స్పేస్ అంటే సమర్థత కోసం” అని వివరించారు. 

చాలా కాలంగా, అంతరిక్ష పరిశ్రమలోని ప్రైవేట్ రంగాన్ని కేవలం విక్రేతగా మాత్రమే చూస్తున్నారని, ఈ విధానం పరిశ్రమలో ప్రైవేట్ రంగం పురోగతికి ఎల్లప్పుడూ అడ్డుగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  గొప్ప ఆలోచనలే విజేతలను చేస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  అంతరిక్ష రంగాన్ని సంస్కరించడం; అన్ని పరిమితుల నుంచి విముక్తి చేయడంతో పాటు, ఇన్-స్పేస్ ద్వారా ప్రైవేట్ పరిశ్రమకు మద్దతు ఇవ్వడం ద్వారా, దేశం ఈ రోజు విజేతలను సృష్టించడానికి ప్రచారాన్ని ప్రారంభిస్తోంది.  తద్వారా, ప్రైవేటు రంగం కేవలం విక్రేతగా మాత్రమే మిగిలిపోకుండా,  అంతరిక్ష రంగంలో పెద్ద విజేత పాత్రను పోషిస్తుంది.  ప్రభుత్వ అంతరిక్ష సంస్థల శక్తి కి భారత దేశ ప్రైవేట్ రంగ అభిరుచి కలిసినప్పుడు, ఆకాశానికి కూడా హద్దుగా ఉండదని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

మునుపటి వ్యవస్థలో, భారత దేశ యువత తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశాలను పొందడం లేదని ప్రధానమంత్రి అన్నారు.  భారతీయ యువత తమతో ఆవిష్కరణ, శక్తి, అన్వేషణ స్ఫూర్తిని తీసుకువస్తారు.  కాలక్రమేణా, నియంత్రణ మరియు పరిమితి మధ్య వ్యత్యాసం మరచిపోవడం దేశం యొక్క దురదృష్టం.  ఈ రోజు మనం తమ ప్రణాళికలను అమలు చేయడానికి కేవలం ప్రభుత్వ విధానం ఒక్కటే మార్గం అనే షరతును మన యువత ముందు ఉంచలేమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.  ఇలాంటి ఆంక్షల శకం ముగిసిపోయిందని, యువతరం బాట నుంచి ప్రభుత్వం అలాంటి ఆంక్షలన్నింటినీ తొలగిస్తోందని ఆయన వివరించారు.  రక్షణ ఉత్పత్తిని ప్రారంభించడం, ఆధునిక డ్రోన్ విధానం, జియో-స్పేషియల్ డేటా మార్గదర్శకాలు, టెలికాం / ఐటీ రంగంలో ఎక్కడి నుంచైనా పని చేయడం వంటి వివిధ అంశాలు ప్రభుత్వ ఉద్దేశాలకు ఉదాహరణలుగా ఆయన తెలియజేశారు.  భార‌త‌దేశంలోని ప్రైవేట్ రంగానికి సులభతర వాణిజ్య వాతావ‌ర‌ణాన్ని మరింతగా సృష్టించ‌డం తమ ప్ర‌య‌త్నమని, తద్వారా దేశంలోని ప్ర‌యివేటు రంగం సులభతర వాణిజ్యంలో దేశ ప్ర‌జ‌ల‌కు సమానంగా సాయపడుతుందని,  ప్ర‌ధానమంత్రి నొక్కి చెప్పారు.

“ఒక శాస్త్రవేత్త అయినా లేదా రైతు-కూలీ అయినా, సైన్స్ యొక్క మెళుకువలను అర్థం చేసుకున్నా లేదా అర్థం చేసుకోకపోయినా, వాటన్నింటినీ అధిగమించి, మన అంతరిక్ష యాత్ర దేశం లోని ప్రజలందరి లక్ష్యం అవుతుంది.  మిషన్ చంద్రయాన్ సమయంలో భారత దేశ ఈ భావోద్వేగ సంఘీభావాన్ని మనం చూశాము.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   దేశం లోని అంతరిక్ష రంగాల్లో 60కి పైగా ప్రైవేట్ కంపెనీలు అధునాతన సంసిద్ధత తో ముందున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  దేశంలోని అంతరిక్ష రంగంలో ఈ మహత్తరమైన మార్పును తీసుకొచ్చినందుకు ఇస్రోను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.  అంతరిక్ష రంగాన్ని ఆవిష్కరించే దశ యొక్క ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటించారు.   ఈ చొరవ లో ఇస్రో చూపిన నైపుణ్యం, సంకల్పాన్ని ఆయన అభినందించారు.   భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఆత్మ నిర్భర్-భారత్-అభియాన్ యొక్క అతిపెద్ద గుర్తింపుగా నిలిచిందని, ఆయన పేర్కొన్నారు. 

“21వ శతాబ్దంలో స్పేస్టెక్ ఒక భారీ విప్లవానికి ఆధారం కానుంది.  అంతరిక్షసాంకేతికత అనేదిఇప్పుడు సుదూర అంతరిక్షానికే కాకుండా సాంకేతికంగా మన వ్యక్తిగత అవసరాలకు కూడా ఉపయోగపడుతోంది అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  అంతరిక్ష సాంకేతికతను దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇన్‌-స్పేస్ నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఆయన అన్నారు.  ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు సేకరించిన సమాచారం భవిష్యత్తులో వాటికి భారీ శక్తిని ఇవ్వబోతోందని ప్రధానమంత్రి అన్నారు.  ప్రపంచ అంతరిక్ష పరిశ్రమ విలువ 400 బిలియన్ అమెరికా డాలర్లు కాగా, అని, 2040 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా మారే అవకాశం ఉందని, ఆయన అన్నారు.  ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో భారతదేశం  తన వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, అందులో ప్రైవేట్ రంగం పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.  అంతరిక్ష పర్యాటకం, అంతరిక్ష దౌత్య రంగాల్లో భారత దేశ బలమైన పాత్ర గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.   మన దేశంలో అనంతమైన అవకాశాలు ఉన్నాయని, అయితే పరిమిత ప్రయత్నాలతో అనంతమైన అవకాశాలను ఎప్పటికీ సాధించలేమని ఆయన నొక్కి చెప్పారు.  అంతరిక్ష రంగంలో ఈ సంస్కరణల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తాను హామీ ఇస్తున్నట్లు, ఆయన స్పష్టం చేశారు.   ప్రైవేట్ రంగాన్ని తప్పనిసరిగా విని, అర్థం చేసుకోవడం తో పాటు, వ్యాపార అవకాశాలను సరిగ్గా విశ్లేషించాలి, దీని కోసం, ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.   ప్రైవేట్ రంగానికి చెందిన అన్ని అవసరాలను నెరవేర్చడానికి, ఇన్-స్పేస్ – ఒక సింగిల్ విండో గా, స్వతంత్ర నోడల్ ఏజెన్సీ గా పని చేస్తుంది.

ప్రభుత్వ కంపెనీలు, అంతరిక్ష పరిశ్రమలు, అంకురసంస్థలు, ఇతర సంస్థల మధ్య సమన్వయం కోసం భారతదేశం కొత్త భారతీయ అంతరిక్ష విధానం పై పని చేస్తోందని,  అంతరిక్ష రంగంలో సులభతర వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం త్వరలో ఒక విధానాన్ని తీసుకు వస్తుందని, ప్రధానమంత్రి తెలియజేశారు.

మానవాళి భవిష్యత్తు, దాని అభివృద్ధి అనేవి – రాబోయే రోజుల్లో అత్యంత ప్రభావవంతమైన రెండు రంగాలపై ఆధారపడి ఉంటాయనీ, అవి అంతరిక్షం, సముద్రం అని ఆయన తెలియజేశారు.   ఈ రంగాల్లో భారత్ జాప్యం లేకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఆయన సూచించారు.   ఈ రంగంలో భారత్ సాధించిన ప్రగతి, సంస్కరణలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన చెప్పారు.  పాఠశాలల్లోని అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు ఈ దిశగా కృషి చేస్తున్నాయని, ప్రధానమంత్రి తెలియజేశారు. అదే విధంగా, శ్రీహరికోటలో ఉపగ్రహాల ప్రయోగాలను 10 వేల మంది తిలకించడానికి వీలుగా ఒక గ్యాలరీ ని రూపొందించేందుకు ఆయన కృషి చేశారు. 

జామ్‌నగర్‌లోని డబ్ల్యూ.హెచ్.ఓ. కు  చెందిన సాంప్రదాయ వైద్య కేంద్రం;  రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం;  పండిట్ దీనదయాళ్ ఎనర్జీ విశ్వవిద్యాలయం;  జాతీయ ఆవిష్కరణల సంస్థ;  చిన్న పిల్లల విశ్వవిద్యాలయం; భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్ – బిసాగ్ తో పాటు ఇప్పుడు ఇన్-స్పేస్ ఏర్పాటు తో గుజరాత్ అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెద్ద విద్యాసంస్థలకు కేంద్రంగా మారుతున్నందుకు, ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సంస్థలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భారతదేశం నలుమూలల నుండి, ముఖ్యంగా గుజరాత్ నుంచి యువతను ఆయన ఆహ్వానించారు.

ఇన్-స్పేస్ స్థాపించనున్నట్లు 2020 జూన్ లో ప్రకటించడం జరిగింది.   ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు చెందిన అంతరిక్ష కార్యకలాపాల అభివృద్ధి, ప్రోత్సాహం, నియంత్రణ కోసం కేంద్ర అంతరిక్ష శాఖలో స్వయం ప్రతిపత్తి కలిగిన సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది.  ఇస్రో సౌకర్యాలను ప్రయివేటు సంస్థలు వినియోగించుకోవడాన్ని కూడా ఇది సులభతరం చేస్తుంది.