జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.ఎ. ఆధారిత స్వదేశీ వ్యాక్సిన్ గురించి మరింతగా తెలుసుకోవడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును ఈరోజు సందర్శించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, “జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించాను. ఈ ప్రయత్నం వెనుక పనిచేస్తున్న బృందం కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయాణంలో వారికి మద్దతుగా భారత ప్రభుత్వం వారితో పాటు కలిసి చురుకుగా పనిచేస్తోంది.” అని పేర్కొన్నారు.
*****
Visited the Zydus Biotech Park in Ahmedabad to know more about the indigenous DNA based vaccine being developed by Zydus Cadila. I compliment the team behind this effort for their work. Government of India is actively working with them to support them in this journey. pic.twitter.com/ZIZy9NSY3o
— Narendra Modi (@narendramodi) November 28, 2020