ఈ రోజు న శ్వేతాంబర్ తేరాపంథ్ యొక్క అహింస యాత్ర సంపన్నత సమారోహ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం మొదట్లో, నిరంతరం పురోగమిస్తూ ఉండాలి అంటూ స్పష్టం చేసిన భారతీయ సాధువుల యొక్క వేల కొద్దీ సంవత్సరాల ప్రాచీన సంప్రదాయాన్ని స్మరించుకొన్నారు. ప్రత్యేకించి శ్వేతాంబర్ తేరాపంథ్ బద్ధకాన్ని విడచిపెట్టి ఆధ్యాత్మిక సంకల్పాని కి పరిణతి ని సంతరించిపెట్టింది అని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. మూడు దేశాల లో 18 వేల కిలోమీటర్ ల ‘పాదయాత్ర’ ను పూర్తి చేసినందుకు గాను ఆచార్య మహాశ్రమణ్ జీ కి ప్రధాన మంత్రి అభినందన లు తెలియజేశారు. ‘వసుధైవ కుటుంబకమ్’ సంప్రదాయాన్ని విస్తరింపచేయడం తో పాటు గా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ మంత్రాన్ని ఒక ఆధ్యాత్మిక సంకల్పం గా ప్రచారం / ప్రసారం చేసినందుకు గాను ఆచార్య ను ఆయన ప్రశంసించారు. శ్వేతాంబర్ తేరాపంథ్ తో తనకు చాలా కాలం నుంచి ఉన్న అనుబంధాన్ని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. అలాగే, ‘‘యే తేరా పంథ్ హై, యే మేరా పంథ్ హై’’ (ఈ తేరా పంథ్, నా తేరా పంథ్ గా ఉంది) అంటూ తాను ఇదివరకు ఇచ్చిన ప్రకటన ను స్మరించుకొన్నారు.
ప్రధాన మంత్రి 2014వ సంవత్సరం లో ఎర్ర కోట నుంచి మొదలైన ‘పాద యాత్ర’ యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. స్వయం గా తాను అదే సంవత్సరం లో భారతదేశం ప్రధాన మంత్రి గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి సార్వజనిక సేవ మరియు ప్రజల సంక్షేమం తాలూకు నూతన ప్రస్థానాన్ని మొదలుపెట్టడం యాదృచ్ఛికం అని ఆయన వెల్లడించారు. పాదయాత్ర తాలూకు ముఖ్యోద్దేశ్యాలు అయిన
సద్భావన, నైతికత మరియు వ్యసనాల కు దూరం కావడం లను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఏ విధమైన వ్యసనాన్ని అయినా వదలిపెట్టినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆత్మ–సాక్షాత్కారం అనేది సాధ్యపడుతుంది అని ఆయన అన్నారు. వ్యసనాల ను విడచిపెట్టడం ద్వారా ఆత్మ ను విశ్వం తో మమేకం చేయడం జరుగుతుందని, మరి ఈ ప్రకారం గా అందరి కి మేలు జరుగుతుందన్నారు.
ప్రస్తుతం ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ కాలం లో సమాజం పట్ల మరియు దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వహించండి అంటూ దేశం పిలుపునిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్ భావన తో ముందుకు కదులుతోందని ఆయన అన్నారు. ప్రతిదీ ప్రభుత్వం ద్వారా నే జరగాలి అనేది భారతదేశం ప్రవృత్తి గా ఎన్నడూ లేదు, మరి ఇక్కడ ప్రభుత్వం, సమాజం మరియు ఆధ్యాత్మిక ప్రాధికారం అనే వాటి కి సమానమైనటువంటి భూమిక ఉంటూ వస్తోందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. దేశం తన సంకల్పాల ను సాధించే దిశ లో కర్తవ్య పథం లో సాగిపోతూ దేశం ఈ భావన ను చాటిచెబుతోంది అని ఆయన అన్నారు.
చివర లో, ఆధ్యాత్మిక సాధువులు దేశం యొక్క ప్రయాసల ను మరియు సంకల్పాల ను ముందుకు తీసుకు పోవడాన్ని కొనసాగించాలి అని ప్రధాన మంత్రి అభ్యర్థించారు.
***
Addressing the Ahimsa Yatra Sampannata Samaroh Karyakram. https://t.co/Vq5SMTXsvV
— Narendra Modi (@narendramodi) March 27, 2022