Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహమదాబాద్ లో నిర్మాణదశ లో ఉన్న భవనం లో దుర్ఘటన జరిగినందువల్ల ప్రాణనష్టం సంభవించినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి


అహమదాబాద్ లో నిర్మాణాధీన స్థితి లో ఉన్న భవనం లో జరిగిన దుర్ఘటన వల్ల ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందిస్తున్నారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో –

‘‘అహమదాబాద్ లో నిర్మాణాధీన స్థితి లో ఉన్న ఒక భవనం లో జరిగిన దుర్ఘటన దుఃఖదాయకం గా ఉంది. ఈ ప్రమాదం లో కుటుంబ సభ్యుల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరలోనే పునఃస్వస్థులు కావాలని నేను ఆశ పడుతున్నాను. బాధితుల కు స్థానిక అధికారులు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందిస్తున్నారు: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

***

 

DS/SH