ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి పూట అహమదాబాద్ లోని జిఎమ్ డిసి మైదానం లో ఏర్పాటైన నవరాత్రి ఉత్సవం సంబంధిత కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ వ్రత్ తో మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తో కలసి కార్యక్రమ స్థలాని కి చేరుకొన్నారు. అక్కడ గుమికూడిన లక్షలాది భక్తజనులు, గవర్నరు మరియు ముఖ్యమంత్రి లతో సహా ప్రధాన మంత్రి మాత అంబ కు మహా ఆరతి ని ఇచ్చారు. భారతదేశం సంస్కృతి కి ప్రతీక అయినటువంటి మరియు గుజరాత్ లో స్థానిక విశిష్టత ను ఇముడ్చుకొన్నటువంటి నవరాత్రి ఉత్సవం లో ప్రధాన మంత్రి భాగం పంచుకోవడం ఈ మంగళప్రదమైనటువంటి ఆ సందర్భం లో భక్తజనుల ను ఆనందోల్లాసాల లో ముంచి వేసింది. ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి కి ఒక శుభప్రదమైన స్మృతి చిహ్నం గా మాత అంబాజీ శ్రీ యంత్రాన్ని అందజేశారు. ప్రధాన మంత్రి సాంస్కృతిక కార్యక్రమాన్ని మరియు గర్ బా ను కూడా వీక్షించారు.
గుజరాత్ లో రెండు రోజుల యాత్ర లో భాగం గా ప్రధాన మంత్రి ఈ రోజు న సూరత్ లో మరియు భావ్ నగర్ లో అనేక కార్యక్రమాల లో పాలుపంచుకొని వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం/వాటిని దేశ ప్రజల కు అంకితం చేయడం/ శంకుస్థాపన లు చేశారు. ఆయన ఈ రోజు న అహమదాబాద్ లో 2022వ సంవత్సరం జాతీయ క్రీడలు ప్రారంభం అవుతున్నాయి అని ప్రకటించారు కూడా.
Joined the Navratri celebrations in Ahmedabad. pic.twitter.com/Sf4QDX1zEu
— Narendra Modi (@narendramodi) September 29, 2022