Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహమదాబాద్ లోనిబావ్ లా-బగోదరా హైవే మీద జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


అహమదాబాద్ లోని బావ్ లా-బగోదరా హైవే మీద జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున, మరి ఇదే ప్రమాదం లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారం గా ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘అహమదాబాద్ జిల్లా లో బావ్ లా – బగోదరా హైవే మీద రహదారి దుర్ఘటన జరిగిన సంగతి తెలిసి బాధపడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు అగుదురుగాక. బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని స్థానిక పాలన యంత్రాంగం అందిస్తోంది.

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.