Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ను ప్రారంభించారు. ఆయన కాలూపుర్ స్టేశన్ నుండి మెట్రో లో దూర్ దర్శన్ కేంద్ర మెట్రో స్టేశన్ వరకు ప్రయాణించారు కూడాను.

ప్రధాన మంత్రి తన గుజరాత్ యాత్ర లో రెండో రోజు న, అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కు పచ్చజెండా ను చూపెట్టారు. ప్రధాన మంత్రి గాంధీనగర్ స్టేశన్ నుండి కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 రైలు లో కూర్చొని ప్రయాణించిన అనంతరం కాలూపుర్ స్టేశన్ కు చేరుకొన్నారు. ఈ సందర్భం లో, ఆయన మెట్రో రైలు సంబంధి ప్రదర్శన ను కూడా చూశారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి వెంట గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్ మరియు గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి లు కూడా ఉన్నారు.

మెట్రో లో ప్రయాణించినపుడు విద్యార్థుల తో, క్రీడాకారుల తో మరియు సాధారణ ప్రయాణికుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు. మెట్రో రైలు లో ఉన్న అనేక మంది ప్రయాణికులు ప్రధాన మంత్రి ఆటోగ్రాఫ్ ను కూడా తీసుకొన్నారు.

అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు బహుళ విధ మౌలిక సదుపాయాల సంబంధిత సంధానాని కి గొప్ప ప్రోత్సాహాన్ని అందించేది అని చెప్పాలి. అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు యొక్క ఒకటో దశ లో అపేరల్ పార్క్ నుండి థల్ తేజ్ వరకు ఈస్ట్ -వెస్ట్ కారిడోర్ మరియు మొటేరా నుండి గ్యాస్ పుర్ మధ్య నార్థ్-సౌథ్ కారిడోర్ కు చెందిన సుమారు 32 కిలో మీటర్ ల భాగం కలసి ఉంది. ఈస్ట్-వెస్ట్ కారిడోర్ లో థల్ తేజ్-వస్త్రల్ మార్గం లో 17 స్టేశన్ లు ఉన్నాయి. ఈ కారిడోర్ లో నాలుగు స్టేశన్ లతో పాటు 6.6 కి.మీ. భూగర్భ భాగం కూడా ఉంది. గ్యాస్ పుర్ ను మోటెరా స్టేడియమ్ తో కలిపే 19 కి.మీ. లతో కూడిన నార్థ్-సౌథ్ కారిడోర్ లో 15 స్టేశన్ లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు తాలూకు ఒకటో దశ ను 12,900 కోట్ల రూపాయల కు పైబడిన ఖర్చు తో నిర్మించడం జరిగింది.

అహమదాబాద్ మెట్రో భూగర్భ సొరంగాలు, వంతెన లు, స్తంభాలు మరియు భూగర్భ స్టేశన్ లు, కంకర ను వాడకుండా అమర్చిన రైలు పట్టాలు మరియు డ్రైవర్ లేకుండా రైలు నునడిపే వ్యవహారం లో రోలింగ్ స్టాక్ తో కూడిన ఒక విశాలమైన అత్యాధునిక మౌలిక సదుపాయాల వ్యవస్థ తో కూడిన ప్రాజెక్టు అని చెప్పాలి. ఈ మెట్రో ట్రైన్ కు ఒక శక్తి సమర్థమైన ప్రపల్శన్ సిస్టమ్ ను జత పరచడమైంది. దీని ద్వారా శక్తి వినియోగం లో దాదాపు 30-35 శాతం ఆదా అవుతుంది. రైలు లో అత్యాధునిక సస్ పెన్శన్ సిస్టమ్ ఉంది. అది ప్రయాణికుల కు చాలా సహజమైన సవారీ తాలూకు అనుభూతి ని అందిస్తుంది.

*****

DS/TS