Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అస‌మ్ లోని కోక్ రాఝార్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం  


భార‌త్ మాతా కీ జ‌య్‌,

భార‌త్ మాతా కీ జ‌య్‌,

భార‌త్ మాతా కీ జ‌య్‌,

వేదిక మీద ఉన్న అస‌మ్ గ‌వ‌ర్న‌రు, పార్ల‌మెంటు లో నా స‌హ‌చ‌రులు, వివిధ బోర్డు ల నాయకులు మరియు వివిధ సంస్థ‌ ల నాయ‌కులు, ఇక్క‌డ కు విచ్చేసిన ఎన్‌డిఎఫ్‌బి కి చెందిన వేరు వేరు వ‌ర్గాల నేత‌ లు, ఇత‌ర ప్ర‌ముఖులు, మ‌రి న‌న్ను ఆశీర్వ‌దించ‌డం కోసం పెద్ద  సంఖ్యల లో ఇక్క‌డ‌ కు త‌ర‌లి వ‌చ్చినటువంటి నా సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

నేను అస‌మ్ కు అనేక సార్లు వచ్చాను.  నేను ఈ చోటు ను కూడా సందర్శించాను.  ఈ ప్రాంతాన్ని నేను చాలా సంవ‌త్స‌రాల నుండి, ఆ మాట‌ కు వ‌స్తే ద‌శాబ్దాల తరబడి సంద‌ర్శిస్తూ వ‌స్తున్నాను.  ప్ర‌ధాన మంత్రి ని అయిన త‌రువాత కూడాను, నేను మిమ్ముల ను చూసేందుకు మ‌ళ్ళీ మళ్ళీ వ‌స్తూనే ఉన్నాను.  అయితే మీ యొక్క ముఖాల లో ఈ రోజు న వ్య‌క్తం అవుతున్న‌టువంటి ఉత్సుకత ‘ఆరోనాయి’ ఇంకా ‘డోఖోనా’ ల యొక్క వర్ణమయ వాతావరణం క‌న్నా కూడా అధికం గా సంతోషాన్ని ఇచ్చేది గా ఉంది.

నేను నా యొక్క సార్వజనిక జీవనం లో, నా యొక్క రాజ‌కీయ జీవనం లో చాలా ర్యాలీ ల‌ను చూశాను; వాటి లో ప్ర‌సంగించాను.  కానీ, నా జీవనం లో ఇంత విశాలమైనటువంటి జ‌న సాగరాన్ని చూసే సౌభాగ్యం నాకు లభించలేదు.  రాజ‌కీయ జీవనం లో తల పండిన వారు  ఈ రోజు న మీరు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ అంత‌టి ఘ‌న‌మైన‌టువంటి రాజకీయ ర్యాలీ స్వాతంత్య్ర సముపార్జన అనంత‌రం భారతదేశం లో ఇదే అని ఎప్పుడో ఒకప్పుడు తప్ప‌క చెబుతారు.  మ‌రి ఇది మీ కారణం గానే సాధ్య‌పడింది.  నేను హెలీకాప్ట‌ర్ లో ఉండి చూస్తున్నప్పుడు, ఈ జ‌న స‌ంద్రాన్ని వీక్షించ‌గ‌లిగాను.  ఎంతో మంది వంతెన మీద నిల‌బ‌డి ఉన్నారు.  వారిలో ఎవ‌రైనా అక్క‌డ నుండి ప‌డిపోవచ్చేమో అనుకుంటూ నేను భ‌యానికి లోనయ్యాను.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

సోద‌రీమ‌ణులు మ‌రియు మాతృమూర్తులు మీరు అందరూ న‌న్ను దీవించ‌డం కోసం ఇంత పెద్ద సంఖ్య లలో విచ్చేశారు.  ఈ కార‌ణం గా నాలో విశ్వాసం కాస్తంత అధిక‌ం అయింది.  కొంత మంది ఒక క‌ర్ర తో కొడ‌తార‌ంటూ మాటలు ఆడుతారు; కానీ, మోదీ కి ఏదీ హాని ని చేయ‌జాల‌దు.  ఎందుకంటే సోద‌రీమ‌ణులు మ‌రియు మాతృమూర్తుల వ‌ద్ద నుండి భారీ ఆశీర్వ‌చ‌నాల రూపం లో ఆయన కు ఒక ర‌క్ష‌ణ క‌వ‌చం ల‌భిస్తున్న‌ది.  మాతృమూర్తులు మ‌రియు  నా సోద‌ర సోద‌రీమ‌ణులు, నా యువ మిత్రులు.. మీకు అంద‌రికీ ఇదే నా ప్ర‌ణామం.  నేను నా గుండె లోతు లో నుండి మిమ్ముల ను హ‌త్తుకోవ‌డం కోసం ఈ రోజు న ఇక్క‌డ కు వ‌చ్చాను;  అస‌మ్ లోని నా ప్రియ‌మైన సోద‌రీమ‌ణుల కు, నా ప్రియమైన సోద‌రుల‌ కు ఒక క్రొత్త విశ్వాసాన్ని ఇవ్వ‌డం కోసం నేను ఈ రోజు న ఇక్క‌డ‌ కు వ‌చ్చాను.  నిన్న‌టి రోజు న మీరు ప్ర‌తి ప‌ల్లె లో మోటారు సైకిల్ పై ఏ విధం గా ర్యాలీలు తీసిందీ, మ‌రి యావ‌త్తు ప్రాంతం లో దీపాల‌ ను వెలిగించిందీ యావ‌త్తు దేశం తిల‌కించింది.  బ‌హుశా దీపావ‌ళి పండుగ వేళ కూడాను ఇన్ని దీపాల ను వెలిగించ‌రేమో. ప్ర‌తి చోటా దీపాల ను వెలిగిస్తున్న స‌న్నివేశాల ను నిన్న‌టి రోజు న నేను టీవీ లోను, సామాజిక మాధ్య‌మాల లోను గ‌మ‌నించాను.  దీని ని గురించి దేశ‌ం అంతా మాట్లాడుతున్న‌ది.   సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా, ఇది కేవ‌లం వేలు, ల‌క్ష‌ల జ్యోతుల ను ప్ర‌జ్వ‌లించ‌డం గురించి కాదు; ఇది దేశం లోని ఒక ముఖ్య‌మైన‌టువంటి ప్రాంతం లో ఒక నూత‌న ఆరంభాన్ని గురించిన సంగ‌తి.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ఈ రోజు న వేలాది మృతవీరులు వారి యొక్క క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ ప‌థం లో సాగుతూ దేశం కోసం ప్రాణాల ను అర్పించిన‌ అటువంటి వారి ని జ్ఞాప‌కాని కి తెచ్చుకోవ‌ల‌సిన‌టువంటి రోజు.  ఈ రోజు బోడోఫా ఉపేంద్ర‌నాథ్ బ్ర‌హ్మ మ‌రియు రూప్‌నాథ్ బ్ర‌హ్మ గారు ల వంటి మ‌హా నేత‌ ల సేవ‌ల ను ఇక్క‌డ గుర్తు కు తెచ్చుకోవ‌ల‌సిన‌టువంటి రోజు.  ఈ రోజు న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియ‌న్ (ఎబిఎస్‌యు)తో, నేశ‌న‌ల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్‌డిఎఫ్‌బి)తో అనుబంధాన్ని క‌లిగివున్న యువ మిత్రులు- ఎవ‌రైతే ఈ ఒప్పందం లో ఒక అతి స‌కారాత్మ‌క‌మైన‌టువంటి మ‌రియు కీల‌క‌మైన‌టువంటి పాత్ర ను పోషించారో- బిటిసి ప్ర‌ముఖుడు శ్రీ హ‌గ్‌రామా మాహీలారే ను గురించి, మ‌రి అలాగే అస‌మ్ ప్ర‌భుత్వాన్ని గురించి త‌ల‌చుకొని, ప్ర‌తి ఒక్క‌రి కి నేను శుభాకాంక్ష‌ల ను తెలియ‌జేయాల‌నుకొంటున్నాను.  నేను యావ‌త్తు భార‌త‌దేశం ప‌క్షాన వారి కి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.  ఈ రోజు న 130 కోట్ల మంది భార‌తీయులు మిమ్మ‌ల్ని అభినందిస్తూ, మ‌రి మీకు ధ‌న్య‌వాదాల ను పలుకుతూ ఉన్నారు.

మిత్రులారా,

ఈ రోజు మీ బోడో స‌హ‌చ‌రులు అంద‌రి ప్ర‌య‌త్నాల ను ఈ యావ‌త్తు ప్రాంతం, ఈ స‌మాజం, ఈ ప్రాంతం యొక్క గురువులు, మేధావులు, ఈ ప్రాంతం యొక్క క‌ళ‌, ఈ ప్రాంతం యొక్క సాహిత్యం.. వీటి ప్ర‌యాస‌ లు అన్నిటిని వేడుక‌ గా జ‌రుపుకోవ‌ల‌సిన‌టువంటి ఒక సంద‌ర్భాన్ని సూచిస్తున్న‌ది.  ఇది గ‌ర్వించ‌వ‌ల‌సిన‌టువంటి ఒక సంద‌ర్భం గా ఉంది.   ఈ శాశ్వ‌త శాంతి మార్గాన్ని మీ అంద‌రి మ‌ద్ధ‌తు తో క‌నుగొన‌డం జ‌రిగింది.  ఈ రోజు న 21వ శ‌తాబ్ది లో ఒక క్రొత్త ఆరంభాన్ని, ఒక నవోద‌యాన్ని, మ‌రి అదే విధం గా న‌వీన‌మైన స్ఫూర్తి ని ఆహ్వానించ‌వ‌ల‌సిన అవ‌కాశం అస‌మ్ తో పాటు, యావ‌త్తు ఈశాన్య ప్రాంతాల కు ద‌క్కింది.  ఈ రోజు న‌మ్మ‌కం మ‌రియు అభివృద్ది.. ఈ రెండే ప్ర‌ధాన అంశాలు గా తీసుకొని, వాటి ని బ‌ల‌ప‌ర‌చేందుకు సంక‌ల్పం చెప్పుకోవ‌ల‌సినటువంటి రోజు.  ఇక మీద‌ట‌ హింస అనే అంధ‌కారం ఈ గ‌డ్డ మీద‌ తిరిగి కమ్ముకోకుండా చూడండి.  ఇప్పుడు ఈ భూమి మీద ఏ మాతృమూర్తి యొక్క పుత్రుడి యొక్క, పుత్రిక‌ యొక్క, లేదా ఏ సోద‌రి కి చెందిన సోద‌రుడి యొక్క, లేదా ఏ సోద‌రుడి కి చెందిన సోద‌రి యొక్క ర‌క్తం నేల పై చిందబోదు.  ఇక మీద‌ట హింస కు ఇక్క‌డ తావు ఉండదు.  ఈ రోజు న అర‌ణ్యం లో భుజానికి ఒక తుపాకి ని తగిలించుకొని నిరంత‌రం మ‌ర‌ణ భ‌యం తో తిరుగాడుతూ ఉండేట‌టువంటి పుత్రుల యొక్క మాతృమూర్తులు మ‌రియు సోద‌రీమ‌ణులు కూడాను న‌న్ను దీవిస్తున్నారు.  ఈ రోజు న ఆ పుత్రులు వారి శిర‌స్సుల ను త‌ల్లి ఒడి లో ఉంచి, ప్ర‌శాంతం గా నిదురించ‌గ‌లుగుతారు.  అటువంటి మాతృమూర్తుల మ‌రియు సోద‌రీమ‌ణులు వారి యొక్క ఆశీర్వాదాలను నాకు ప్రసాదిస్తున్నారు.  ఒక‌సారి ఊహించండి.. అనేక ద‌శాబ్దుల పాటు రాత్రింబ‌వ‌ళ్ళు తుపాకీ గుండ్ల‌ ను ఉప‌యోగిస్తూ వ‌చ్చారు.  ఈ రోజు న ఆ కోవ కు చెందిన జీవ‌నం నుండి బ‌య‌ట ప‌డేందుకు ఒక క్రొత్త దారి ని తెర‌వ‌డం జ‌రిగింది.  నేను మీ అంద‌రి ని శాంతి ప్రియ‌త్వం క‌లిగిన అస‌మ్, శాంతి ని కోరుకొనేట‌టువంటి మ‌రియు అభివృద్ధి ప‌ట్ల మైత్రి నెర‌పేట‌టువంటి ఈశాన్య ప్రాంతాల కు నా హృద‌యం యొక్క అంతరాళం  లో నుండి  స్వాగ‌తం ప‌లుకుతున్నాను.  రండి, ‘న్యూ ఇండియా’ యొక్క న‌వీన సంక‌ల్పాల లో భాగాన్ని పంచుకోండి.

మిత్రులారా,

ఈశాన్య ప్రాంతాల లో శాంతి మ‌రియు అభివృద్ధి ల తాలూకు ఒక క్రొత్త అధ్యాయాన్ని జ‌త చేస్తున్న‌టువంటి ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన‌ ఘ‌డియ ఇది.  మ‌రి దేశం గాంధీ మ‌హాత్ముని 150వ జ‌యంతి ని జ‌రుకొంటున్నటువంటి త‌రుణం లో ఈ చారిత్రిక ఘ‌ట్టం యొక్క ప్రాసంగిక‌త మ‌రింత గా పెర‌గ‌డం అనేది ఒక ఆశ్చ‌ర్య‌జ‌న‌క‌మైన యాదృచ్ఛిక.  అదే విధం గా యావ‌త్తు ప్ర‌పంచాని కి ఇది ఒక ప్రేర‌ణ గా కూడా నిలుస్తున్నది.  ఎలాగంటే, ఇది హింసా ప‌థాన్ని వీడి, అహింస బాట‌ న అడుగిడాల‌నే ఒక సందేశాన్ని ఇస్తున్న‌ది.  గాంధీ మ‌హాత్ముడు అనే వారు.. మ‌నం అహింస పంథా లో ముందుకు సాగి దేనిని పొందిన‌ప్ప‌టికిని అది సర్వులకు ఆమోద‌ యోగ్యం అవుతుంది.. అని.  ప్ర‌స్తుతం అస‌మ్ లో ఎంతో మంది స్నేహితులు ప్ర‌జాస్వామ్యాన్ని ఒప్పుకోవడ‌మే కాక శాంతి, అహింస ల దారి ని కూడాను స్వీకరించారు.  వారు భార‌త‌దేశ రాజ్యాంగాన్ని అన్నిటి క‌న్నా ఉన్న‌త‌మైంది గా భావించారు.

మిత్రులారా,

ఈ రోజు న ఎప్పుడైతే మ‌నం కోక్ రాఝార్ లోని ఈ చారిత్రిక శాంతి ఒప్పందాన్ని ఒక ఉత్స‌వం గా జ‌రుపుకొంటున్నామో, ఇదే సంద‌ర్భం లో గోలాఘాట్ లో శ్రీ‌మంత శంక‌ర్‌దేవ్ సంఘ్ యొక్క వార్షిక స‌మ్మేళనం కూడా జ‌రుగుతూ ఉంది.

मोई मोहापुरुख श्रीमंतो होंकोर देवोलोई गोभीर प्रोनिपात जासिसु।

मोई लोगोत ओधिबेखोन खोनोरु होफोलता कामना कोरिलों !!

మహాపురుషుడు శంక‌ర్ దేవ్ జీ కి నేను శిర‌స్సు ను వంచి ప్ర‌ణ‌మిల్లుతున్నాను.  ఈ స‌మ్మేళనం ఫ‌ల‌ప్ర‌దం కావాలని నేను అభిల‌షిస్తున్నాను.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

శ్రీ‌మంత్ శంక‌ర్ దేవ్ జీ అస‌మ్ యొక్క భాష, అస‌మ్ యొక్క సాహిత్యం సుసంప‌న్నం అయ్యేట‌టువంటి ఒక మార్గాన్ని చూప‌డం తో పాటు యావ‌త్తు భార‌త‌దేశాని కి, ఆ మాట‌ కు వ‌స్తే ప్ర‌పంచాని కి కూడాను మార్గ‌ద‌ర్శ‌కులు గా నిల‌చారు.

అస‌మ్ తో పాటు, యావత్తు ప్ర‌పంచాని కి శంక‌ర్ దేవ్ జీ ఇలా అని పేర్కొన్నారు –

సత్య శౌచ అహింసా శిఖిబే సమ్ దమ్
సుఖ్ దు:ఖ్ శీత్ ఉష్ణ్ ఆత్ హైబ్ సమ్

ఈ మాట‌ల కు స‌త్యం నుండి నేర్చుకోండి, అహింస నుండి నేర్చుకోండి, క్ష‌మించ‌డం నుండి నేర్చుకోండి అని భావం.  మిమ్ముల‌ను మీరు సంతోషాన్ని, విచారాన్ని, ఉష్ణాన్ని గానీ, శీత‌లాన్ని గానీ భ‌రించేందుకు స‌న్న‌ద్ధం చేసుకోండి.  ఈ ఆలోచ‌న‌ల లో స‌మాజం యొక్క అభివృద్ధి అనేది ఒక వ్య‌క్తి యొక్క స్వీయ అభివృద్ధి లో ఇమిడివుంటుంది అనే సందేశం ఉంది.  ఈ రోజు ద‌శాబ్దాల అనంత‌రం అభివృద్ధి కోసం ఈ మార్గాన్ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం జ‌రిగింది.  ఇది వ్య‌క్తి యొక్క అభివృద్ధి తో పాటు, ఈ యావ‌త్తు ప్రాంతం లోని స‌మాజ అభివృద్ధి కోసం ఉద్దేశించింది.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

బోడోలాండ్ మూవ్‌మెంట్ లో భాగం అయిన వారంద‌రి ని దేశ ప్ర‌ధాన స్ర‌వంతి లో చేర‌వ‌ల‌సింది గా నేను మ‌నస్ఫూర్తి గా ఆహ్వానిస్తున్నాను.  బోడోలాండ్ మూవ్‌మెంట్ తో సంబంధం క‌లిగివున్న ప్ర‌తి ఒక్క‌రి ఆశ‌ల ను మ‌రియు ఆకాంక్ష‌ల ను స్వీక‌రించి, ప‌రిపూర్ణ‌మైన స‌ద్భావ‌న తో అయిదు ద‌శాబ్దులు గ‌డిచిన త‌రువాత స‌ముచిత‌మైన ఆద‌ర‌ణ ను చూప‌డ‌మైంది.  ప్ర‌తి ఒక్క ప‌క్షం యొక్క స‌మృద్ధి కోసం, ప్ర‌తి ఒక్క ప‌క్షం యొక్క అభివృద్ధి కోసం, ఇంకా చిర‌కాల శాంతి కోసం హింస కు క‌ల‌సిక‌ట్టుగా స్వ‌స్తి ప‌ల‌క‌డం జ‌రిగింది.  ప్రియ‌మైన నా సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా, ఈ దేశం ఈ యొక్క ఘ‌ట్టాన్ని తిలకిస్తున్న‌ది.  టీవీ చాన‌ల్స్ అన్నీ కూడాను మిమ్ముల‌ ను ఈ రోజు న ప‌ట్టి చూపిస్తున్నాయి.  దీనికి కార‌ణం, మీరు భార‌త‌దేశం లో ఒక క్రొత్త చ‌రిత్ర ను, ఒక క్రొత్త న‌మ్మ‌కాన్ని ఆవిష్క‌రించారు.  మీరు శాంతి మార్గాని కి ఒక న‌వీన‌మైనటువంటి శ‌క్తి ని ఇచ్చారు.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ఈ ఉద్య‌మాని కి సంబంధించిన కోర్కె లు అన్నిటి ని ఇక ఆమోదించిన కార‌ణం గా మీ అంద‌రి ని నేను అభినందించ ద‌లుస్తున్నాను.  ఇప్పుడిక దాని కి పూర్ణ విరామం దొరికింది.  1993వ సంవ‌త్స‌రం లో, మ‌రి అలాగే 2003వ సంవ‌త్స‌రం లో జ‌రిగిన ఒప్పందాలు సంపూర్ణం గా శాంతి ని నెల‌కొల్ప‌లేక‌పోయాయి.  మ‌రి చారిత్రిక ఒడంబ‌డిక అనంత‌రం- దేనినైతే కేంద్ర ప్ర‌భుత్వం, అస‌మ్ ప్ర‌భుత్వం, బోడో ఉద్య‌మం తో అనుబంధం క‌లిగిన సంస్థ‌ లు ఒప్పుకొన్నాయో- ఇప్పుడు ఇక ఏ డిమాండు ను వ‌ద‌లివేయ‌డం జ‌రుగ‌లేదు.  ఇప్పుడిక అభివృద్ధి కే ప్ర‌థ‌మ ప్రాధాన్యాన్ని, తుది ప్రాధాన్యాన్ని కూడా క‌ట్ట‌బెట్ట‌డ‌మైంది.

మిత్రులారా,

నాపైన నమ్మకం ఉంచండి మీ కోసం, మీ యొక్క దు:ఖాలు, మీ యొక్క ఆశ‌ లు, మీ యొక్క ఆకాంక్ష‌ లు, మీ యొక్క అపేక్ష‌ లు, మ‌రి మీ పిల్ల‌ల‌ కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల నుండి నేను ఎన్న‌టికీ వెనుదిరుగ‌ను.  ఎందుకంటే ఎప్పుడైతే మీరు తుపాకులు ప‌డ‌వేసి వ‌చ్చారో, పిస్తోళ్ళు మ‌రియు బాంబుల దారి ని వ‌ద‌లిపెట్టి వచ్చారో, మీరు తిరిగి వ‌చ్చిన‌ అటువంటి ప‌రిస్థితుల ను గురించి నాకు తెలుసును.  మ‌రి ఆ విష‌యాలు అన్నీ నాకు ఊహ‌ కు అందేవే.  అందుకని నేను ఈ శాంతి ప్ర‌క్రియ బాట‌ లో మీకు ఏ ఒక్క ముల్లయినా గ్రుచ్చుకోకుండా ఎప్పటి కి జాగ్ర‌త్త తీసుకొంటాను.  దీనికి కారణం ఈ శాంతి, ఈ గౌర‌వం, ఈ ప్రేమ మ‌రియు ఈ అహింస తో కూడిన మార్గం లో మీరు చూస్తారు.. యావ‌త్తు అస‌మ్ మీ యొక్క హృద‌యాల‌ ను గెలుచుకొంటుంది; యావ‌త్తు భార‌త‌దేశం మీ యొక్క మ‌న‌స్సుల ను గెలుచుకొంటుంది; ఎందుకంటే మీరు స‌రి అయిన‌టువంటి దారిని ఎంచుకొన్నారు అందుక‌ని.

మిత్రులారా,

ఈ ఒడంబ‌డిక యొక్క లాభాన్ని బోడో తెగ కు చెందిన స‌భ్యుల తో పాటు ఇత‌ర స‌మాజాల ప్ర‌జ‌ల కు కూడా అందించ‌డం జ‌రుగుతుంది.  ఈ ఒప్పందం లో భాగం గా బోడో టెరిటోరియ‌ల్ కౌన్సిల్ (బిటిసి) యొక్క హ‌క్కుల ప‌రిధి ని విస్త‌రించ‌డ‌మైంది.  అంతేకాకుండా వాటిని మ‌రింత గా బ‌లోపేతం చేయ‌డం జ‌రిగింది.  ఇది అన్ని ప‌క్షాల కు ఫ‌లాల‌ ను అందించేదే.  మ‌హ‌త్తు క‌లిగిన అంశం ఏమిటి అంటే దీని ద్వారా శాంతి గెలిచింది; అలాగే దీని ద్వారా మాన‌వీయ‌త కూడా గెలిచింది.  మీరు లేచి నిల‌బ‌డి నా గౌర‌వార్ధం క‌ర‌తాళ ధ్వ‌నులు చేశారు.  మ‌రి నేను మీరంతా నిల్చొని మ‌రొక్క‌మారు చ‌ప్ప‌ట్లు చ‌ర‌చాల‌ని కోరుకుంటున్నాను.  ఆ చ‌ప్ప‌ట్లు నా కోసం కాదు, అవి శాంతి కోసం;  మీరంతా శాంతి ప‌క్షాన నిల‌చినందుకు గాను మీ అంద‌రి కి నేను కృతజ్ఞతాబద్ధుడిని అయివున్నాను.

ఒడంబ‌డిక లో భాగం గా బిటిఎడి ప‌రిధి లోకి వచ్చే ప్రాంతాని కి స‌రిహ‌ద్దు ను నిర్ధారించేందుకు ఒక క‌మిశ‌న్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.  ఈ ప్రాంతం 1500 కోట్ల రూపాయ‌ల తో కూడిన‌టువంటి ఒక ప్ర‌త్యేక డివెల‌ప్‌మెంట్ ప్యాకేజి కు అర్హ‌త ను పొందుతుంది.  దీని ద్వారా కోక్ రాఝార్, చిరాంగ్, బ‌క్సా, ఉదాల్‌గుడి వంటి జిల్లాలు ఎంత‌గానో ల‌బ్ధి ని పొందుతాయి. అంటే బోడో తెగ యొక్క ప్ర‌తి ఒక్క హ‌క్కు, బోడో సంస్కృతి యొక్క అభివృద్ధి, మ‌రి వారి ప‌రిర‌క్ష‌ణ‌.. వీట‌న్నింటి కి పూచీ ల‌భిస్తుంది అని దీని కి అర్థం అన్న‌ మాట‌.  ఈ ఒప్పందం ఫ‌లితం గా ఈ ప్రాంతం లో రాజ‌కీయ ప‌ర‌మైన‌, ఆర్థిక‌ ప‌ర‌మైన మ‌రియు విద్యా సంబంధ‌మైన అన్ని ర‌కాల పురోగ‌తి చోటు చేసుకోనున్నది.

నా సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ప్ర‌భుత్వం అస‌మ్ ఒడంబ‌డిక లోని 6వ సెక్ష‌ను ను సైతం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అమ‌లులోకి తెచ్చేందుకు ప్రస్తుతం ప్ర‌య‌త్నిస్తున్న‌ది.  ఈ అంశాని కి సంబంధించిన క‌మిటీ నివేదిక అందిన త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వం మిగ‌తా కార్యాచ‌ర‌ణ ను శీఘ్ర‌ గ‌తి న చేప‌డుతుంద‌ని అస‌మ్ ప్ర‌జ‌ల కు నేను హామీ ని ఇస్తున్నాను.  మేము అస‌త్య వాగ్ధానాల‌ ను చేసేట‌టువంటి వాళ్ళం కాదు.  మా స్వ‌భావమ‌ల్లా బాధ్య‌త ను స్వీక‌రించ‌డం.  అందువల్ల అనేక సంవ‌త్స‌రాల‌ పాటు స్తంభించిపోయిన అస‌మ్ యొక్క అంశాన్ని మేము ప‌రిష్క‌రిస్తాము.

మిత్రులారా,

ప్ర‌స్తుతం బోడో ప్రాంతం లో క్రొత్త అపేక్ష‌లు, క్రొత్త స్వ‌ప్నాలు మ‌రియు క్రొత్త స్ఫూర్తులు అంకురించాయి.  మీ అంద‌రి యొక్క బాధ్య‌త ఎన్నో రెట్లు అధిక‌ం అయింది.  ఇక్క‌డి ప్ర‌తి స‌ముదాయాన్ని దృష్టి లో పెట్టుకొని ఎటువంటి వివ‌క్ష‌ కు తావు ఇవ్వ‌కుండా అభివృద్ధి తాలూకు ఒక నూత‌న న‌మూనా ను బోడో టెరిటోరియ‌ల్ కౌన్సిల్ ఇక రూపొందిస్తుంద‌న్న న‌మ్మ‌కం నాలో ఉంది.  అస‌మ్ ప్ర‌భుత్వం కొన్ని ప్ర‌ధాన‌మైన నిర్ణ‌యాల ను తీసుకోవ‌డ‌మే కాకుండా బోడో భాష‌ కు, బోడో సంస్కృతి కి సంబంధించి ముఖ్య‌మైన ప‌థ‌కాల‌ ను ప్ర‌క‌టించింద‌ని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.  బోడో టెరిటోరియ‌ల్ కౌన్సిల్‌, అస‌మ్ ప్ర‌భుత్వం మ‌రియు కేంద్ర ప్ర‌భుత్వం ఇక క‌ల‌సిక‌ట్టు గా ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్ మ‌రియు స‌బ్‌కా విశ్వాస్’కు ఒక క్రొత్త పార్శ్వాన్ని జోడించనున్నాయి.  సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా, ఇది అస‌మ్ ను ప‌టిష్ట‌ ప‌ర‌చ‌డం ఒక్క‌టే కాకుండా ‘ఏక్ భార‌త్, శ్రేష్ఠ‌ భార‌త్’ యొక్క స్ఫూర్తి ని కూడాను బ‌లోపేతం చేస్తుంది.

మిత్రులారా,

ఇప్పుడు మనం పాత సమస్యల తో సతమతం కావలసిన అవసరం లేదని 21వ శతాబ్దపు భారతదేశం నిర్ణయించుకొన్నది. దేశం ప్రస్తుతం కఠిన సవాళ్లకు పరిష్కారాల ను కోరుకుంటున్నది. దేశం ఎదుట అనేక సవాళ్లు ఉండేవి, వాటి ని ఒక్కో సారి రాజకీయ కారణాల వల్ల, ఒక్కో సారి సామాజిక కారణాల వల్ల పట్టించుకోవడం జరుగలేదు. దీంతో ఈ సవాళ్లు దేశం లో వివిధ ప్రాంతాల లో హింస కు, అస్థిరత కు, అపనమ్మకాల కు దారితీశాయి.

దేశం లో ఈ పరిస్థితి దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య ప్రాంత సమస్య ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని విషయం గా పరిగణించబడింది. ఉద్యమాలు, దిగ్బంధనాలు జరిగితే వాటి ని ఎవరూ పట్టించుకొనే వారు కాదు. ఎప్పుడైనా అక్కడ హింసాత్మక సంఘటన లు సంభవిస్తే వాటిని నియంత్రించి, ఆ తరువాత వాటి ని విస్మరించే వారు. ఈశాన్య ప్రాంతం లో ఇదే విధానం అమలయ్యేది. ఈ విధానం ఈశాన్య ప్రాంతాని కి చెందిన మన సోదరుల ను, సోదరీమణుల ను దూరం చేసిందని నేను విశ్వసిస్తున్నాను. ఫలితం గా వారు రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన విశ్వాసాన్ని కోల్పోయారు. గత దశాబ్దాల లో ఈశాన్య ప్రాంతంలో వేల మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. రక్షణ సిబ్బంది వేల సంఖ్య లో అమరులు అయ్యారు. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. లక్షల మంది అసలు అభివృద్ధి అంటే ఏమిటో ఎప్పుడూ చూడలేదు. గత ప్రభుత్వాల కు ఈ వాస్తవాలన్నీ తెలుసు, వాటి ని అర్ధం చేసుకొన్నాయి, వాటి ని అంగీకరించాయి, కానీ, ఈ పరిస్థితి ని మార్చడానికి అవి ఎన్నడూ కృషి చేయలేదు. ఇంత పెద్ద సమస్య పై ఎందుకు జోక్యం చేసుకోవాలి అని వారు భావించే వారు. అందుకే వారు ప్రతి విషయాన్ని దాని ప్రారబ్ధాని కి వదలివేశారు.

సోదర, సోదరీమణులారా,

జాతీయ ప్రయోజనాలే ప్రధానమైనవి గా భావించినట్లయితే పరిస్థితుల ను ఈ విధం గా వదలివేసేందుకు అవకాశం ఉండదు. మొత్తం ఈశాన్య ప్రాంతం సమస్య చాలా సున్నితమైంది. అందువల్ల మేము ఒక కొత్త విధానం తో పనిచేయడం ప్రారంభించాము. ఈశాన్య ప్రాంతం లోని వివిధ ప్రాంతాల వారి భావోద్వేగ అంశాల ను, వారి ఆశల ను, ఆకాంక్షల ను మేము గ్రహించాము. ఇక్కడ నివసిస్తున్న ప్రజల తో మేము మమేకమై, ఎంతో సంభాషించా ము. వారిలో విశ్వసాన్ని ప్రోది చేశాము. వారి ని దూరం గా పెట్టలేదు. ఒంటరి వారం అనే భావాన్ని వారి నుండి దూరం చేశాము. మేము మిమ్ముల ను వేరు గా పరిగణించ లేదు, మీ నాయకులను కూడాను వేరు గా భావించలేదు. ఇదే ఈశాన్య ప్రాంతం లో, గతంలో తిరుగుబాటు కార్యకలాపాలు/ చొరబాటు చర్యల కారణం గా సరాసరి న ఏడాది లో సుమారు వేయి మంది కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే వారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా శాంతియుత వాతావరణం నెలకొంది. ఉగ్రవాదం అంతమవుతోంది.

ఈశాన్య ప్రాంతం లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం (ఎఎఫ్ఎస్ పిఎ) దాదాపు ప్రతి ప్రాంతం లోనూ అమలు లో ఉండేది. మేము అధికారం లోకి వచ్చాక త్రిపుర, మిజోరమ్, మేఘాలయ, అరుణాచల ప్రదేశ్ ల లోని చాలా ప్రాంతాలు ఎఎఫ్ఎస్ పిఎ పరిధి నుండి విముక్తి పొందాయి. గతం లో ఈశాన్య ప్రాంతం లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్త లు సిద్ధంగా ఉండే వారు కాదు. అయితే ఇప్పుడు వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ప్రాజెక్టుల ను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారు.

ప్రత్యేక భూ భాగం కావాలని పోరాటాలు జరిగిన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్పూర్తి తో బలోపేతం అయింది. ఈశాన్య ప్రాంతం లో గతం లో హింసాత్మక సంఘటన ల కారణం గా వేల ప్రజలు తమ సొంత దేశంలోనే శరణార్థులు గా ఉండే వారు. అయితే ఇప్పుడు వారు కొత్త సౌకర్యాల తో పూర్తి గౌరవ, మర్యాదల తో స్థిరపడడానికి అవకాశాలను కల్పించడం జరిగింది. గతం లో దేశం లోని ఇతర ప్రాంతాల నుండి ఈశాన్య ప్రాంతాని కి రావాలంటే భయపడే వారు. అయితే ఇప్పుడు ఇది వారికి ఒక ఇష్టమైన పర్యాటక కేంద్రం గా మారింది.

మిత్రులారా,

ఈ మార్పు ఎలా వచ్చింది ? ఇది కేవలం ఒక్క రోజు లో వచ్చింది కాదు. ఇది అయిదు సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితం. గతం లో ఈశాన్య రాష్ట్రాలు కేవలం గ్రహీతలు గా ఉండేవి. అయితే, ఈ రోజు న అవి అభివృద్ధి కి మార్గదర్శకం గా ఉన్నాయి. గతం లో ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీ కి చాలా దూరంగా ఉన్నట్లు భావించే వారు. ఈ రోజు న ఢిల్లీ మీ ముంగిట్లో ఉంది. మీ సంతోషాన్ని కోరుతూ, మీ విచారాన్ని పోగొడుతోంది. నన్ను చూడండి . నేను నా బోడో స్నేహితుల తో మాట్లాడాలి. అదే విధంగా అసమ్ ప్రజల తో కూడా. అయితే అందుకోసం నేను ఢిల్లీ నుండి సందేశాన్ని పంపలేదు. దానికి బదులు గా నేను మిమ్ముల ను కలిశాను. మీతో వ్యక్తిగతం గా మాట్లాడాను. మీ ఆశీర్వాదం కోరాను. ఈ రోజు న మీతో భేటీ అవుతున్నాను. ప్రతి 10-15 రోజుల కు ఒక సారి కొంత మంది కేంద్ర మంత్రులు ఈశాన్య ప్రాంతం లో పర్యటించేలా ఏర్పాటు చేశాను. వారి కోసం నేను ఒక జాబితా ను రూపొందించాను. వారు తప్పకుండా ఒక రాత్రి అక్కడే ఉండాలి. ప్రజలను కలసి, వారి సమస్యల ను తీర్చాలి. మేము ఇక్కడ కు వచ్చి ఈ పని ని చేస్తాము. మా సహోద్యోగులు ఇక్కడ ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ మంది ని కలుసుకొంటారు, వారి సమస్యల ను అర్ధం చేసుకొంటారు, వాటి ని పరిష్కరిస్తారు. నేను, నా ప్రభుత్వం మీ సమస్యల గురించి నిరంతరం తెలుసుకొంటున్నాము. మీ నుండి నేరు గా అభిప్రాయాలను తీసుకొని అందుకు అనుగుణం గా కేంద్ర ప్రభుత్వ స్థాయి లో అవసరమైన విధానాల ను రూపొందిస్తున్నాము.

మిత్రులారా,

13వ ఆర్ధిక సంఘం సమయం లో, ఈశాన్య ప్రాంతం లోని 8 రాష్ట్రాలు కలిసి 90 వేల కోట్ల రూపాయల కంటే తక్కువ గా నిధులు లభించాయి. మేము అధికారం లోకి వచ్చాక, 14వ ఆర్ధిక సంఘం సమయం లో సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాము. 90 వేల కోట్ల రూపాయల ను, 3 లక్షల కోట్ల రూపాయల తో పోల్చండి.

ఈశాన్య ప్రాంతం లో గడచిన మూడు, నాలుగు సంవత్సరాల లో 3,000 కి.మీ. మేర రహదారులను నిర్మించడమైంది. కొత్త జాతీయ రహదారుల ను ఆమోదించడం జరిగింది. మొత్తం ఈశాన్య ప్రాంతంలో రైల్వే నెట్ వర్క్ ను బ్రాడ్ గేజ్ గా మార్చడమైంది. ఈశాన్య ప్రాంతం లో కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పాత విమానాశ్రయాల ను ఆధునికీకరించడం వంటి పనులు అతి వేగం గా సాగుతున్నాయి.

ఈశాన్య ప్రాంతం లో సమృద్ధి గా నీటి వనరుల తో చాలా నదులు ఉన్నాయి. అయితే 2014వ సంవత్సరం వరకు అక్కడ ఒకే ఒక జల మార్గం ఉంది. 365 రోజులూ ప్రవహించే ఈ జీవ నదుల ను ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు 12 కంటే ఎక్కువ జల మార్గాల పై పని నడుస్తోంది. విద్య, నైపుణ్యాలు, క్రీడల కు సంబంధించిన సంస్థ ల ద్వారా ఈశాన్య ప్రాంతాల యువత ను పటిష్టపరచడంపై కూడా దృష్టి కేంద్రకరించడం జరిగింది. వీటి తో పాటు ఈశాన్య ప్రాంతాల విద్యార్థుల కోసం ఢిల్లీ లో, బెంగళూరు లో కొత్త గా వసతి గృహాల ను కూడా ఏర్పాటు చేస్తున్నాము.

మిత్రులారా,

కొత్త రైల్వే స్టేశన్ లు, కొత్త రైల్వే మార్గాలు, కొత్త విమానాశ్రయాలు, కొత్త జల మార్గాలు, ఇంటర్ నెట్ అనుసంధానం వంటి మౌలిక సదుపాయాల పై ఈ రోజు న ఏ స్థాయి లో పనులు జరుగుతున్నాయో, ఆ స్థాయి లో గతం లో ఎప్పుడూ పనులు జరగలేదు. దశాబ్దాల తరబడి అనిర్ణీత స్థితి లో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేయడం తో పాటు ఈ కొత్త ప్రాజెక్టు పనుల ను అత్యంత వేగం గా పూర్తి చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు అత్యంత వేగం గా పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు లు ఈశాన్య ప్రాంతాల లో అనుసంధానం మెరుగుపడుతుంది. పర్యటక రంగం బలవత్తరమవుతుంది. లక్షల మందికి కొత్త గా ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. ఈశాన్య ప్రాంతం లోని ఎనిమిది జిల్లాల లో గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టు ల కోసం గత నెల లో సుమారు 9,000 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేయడం జరిగింది.

మిత్రులారా,

మౌలిక సదుపాయాలు అంటే కేవలం సిమెంట్, కాంక్రీట్ మాత్రమే కాదు. అందులో మానవ ప్రమేయం ఉండాలి; ఎవరైనా ఒకరు తమ ను పట్టించుకున్నట్లు ఉండాలి. బోగీబీల్ వంతెన వంటి దశాబ్దాలు గా పెండింగులో ఉన్న చాలా ప్రాజెక్టు లు పూర్తి కావడం ద్వారా లక్షల మంది ప్రజలు అనుసంధానం అయినప్పుడు, ప్రభుత్వం పై వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది. ఆ విధం గా విడివిడి గా ఉన్న వాటి ని కలపడం లో సర్వతోముఖ అభివృద్ధి ప్రధానమైనటువంటి పాత్ర ను పోషిస్తుంది. అప్పుడు మనం ఒంటరి గా ఉన్నాం అనే భావన ఉండదు. సామరస్య భావన మాత్రమే ఉంటుంది. సామరస్యం, అనుబంధం నెలకొని ఉన్న చోటులో పురోగతి ప్రతి ఒక్కరి కి సమానం గా లభిస్తుంది. అప్పుడు ప్రజలు కూడా కలసి పని చేయడానికి సిద్ధం గా ఉంటారు. ప్రజలు కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నపుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా సులువు గా పరిష్కారమౌతుంది.

మిత్రులారా,

అటువంటి ఒక సమస్యే బ్రు రియాంగ్ తెగ కు చెందిన ఆదివాసీల పునరావాస కల్పన. శరణార్థులు గా జీవించవలసి వచ్చిన బ్రూ రియాంగ్ గిరిజనుల పునరావాసం కోసం త్రిపుర, మిజోరమ్ ల మధ్య కొన్ని రోజుల క్రితం ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. సుమారు రెండున్నర దశాబ్దాల అనంతరం ఈ ఒప్పందం ద్వారా వేల కుటుంబాల కు ఇప్పుడు శాశ్వత ఇల్లు, ఒక శాశ్వత చిరునామా లభించాయి. బ్రు రియాంగ్ గిరిజన సమాజం నుండి వచ్చిన ఈ కొత్త మిత్రుల కు సరైన స్థిరత్వాన్ని ప్రభుత్వం ద్వారా కల్పించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్యాకేజీ ని ఇవ్వడం జరుగుతుంది.

మిత్రులారా,

ఈ రోజు న దేశం లో మన ప్రభుత్వం చేసిన చిత్తశుద్ధియుత ప్రయత్నాల వల్ల సమైక్య దేశం లో అభివృద్ధి సాధ్యం అనే అభిప్రాయం ప్రజల లో ప్రబలం గా నెలకొంది. ఇదే స్ఫూర్తి తో కొన్ని రోజుల క్రితం గువాహటీ లో 8 వేరు వేరు బృందాల కు చెందిన దాదాపు 650 మంది కార్యకర్త లు హింసా మార్గాన్ని విడనాడి, శాంతియుత మార్గాన్ని ఎంచుకొన్నారు. వీరు అత్యాధునిక ఆయుధాలు, పెద్ద మొత్తం లో ప్రేలుడు పదార్ధాలు, తుపాకి గుండుల తో స్వచ్చందం గా లొంగిపోయారు. వారు అహింసా విధానానికి లొంగిపోయారు. వారు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అండ తో పునరావాసాన్ని పొందుతున్నారు.

మిత్రులారా,

గత ఏడాది ప్రభుత్వానికి, నేశనల్ లిబరేషన్ ఫ్రంట్ అఫ్ త్రిపుర (ఎన్ఎల్ఎఫ్ టి) కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కూడా ఒక చాలా ముఖ్యమైన ముందడుగు అని నేను భావిస్తున్నాను. 1997వ సంవత్సరం లో ఎన్ఎల్ఎఫ్ టిని నిషేధించడమైంది. ఈ సంస్థ గత అనేక సంవత్సరాలు గా అహింసా మార్గాన్ని అనుసరిస్తోంది. మా ప్రభుత్వం 2015వ సంవత్సరం లో ఎన్ఎల్ఎఫ్ టితో చర్చ లు ప్రారంభించింది. ఈ ప్రక్రియ అమలు కు మేము కొంత మంది మధ్యవర్తుల ను వినియోగించుకున్నాము. ఆ తరువాత కొద్ది కాలంలోనే బాంబు ల సంస్కృతి ని అనుసరించిన వారే, తుపాకులు, పిస్టళ్ల ను వదిలి, హింసా వ్యాప్తి కి స్వస్తి పలికారు. ఈ దిశ గా సాగిన నిర్విరామ కృషి అనంతరం గత ఏడాది ఆగస్టు 10వ తేదీన ఆ సంస్థ ఆయుధాల ను త్యజించి రాజ్యాంగాన్ని అనుసరించి జన జీవన స్రవంతి లో కలవడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం డజన్ ల కొద్దీ ఎన్ఎల్ఎఫ్ టి కార్యకర్త లు లొంగిపోయారు.

సోదర, సోదరీమణులారా,

వోట్ లు, రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సమస్య లు, ఇబ్బందుల ను పెండింగు లో పెట్టడం వల్ల, అసమ్, ఈశాన్య ప్రాంతం లతో పాటు యావత్తు దేశం చాలా నష్టపోయింది.

మిత్రులారా,

ఈ విధమైన రహదారి దిగ్భంధనాలు, అసౌకర్యాలు కల్గించడం వంటి రాజకీయాల ద్వారా దేశాని కి వ్యతిరేకం గా పనిచేసే ఒక మనస్తత్వం రూపుదిద్దుకొంది. ఇటువంటి ఆలోచన లు, పోకడ లు, రాజకీయాల ను ప్రోత్సహించే వారికి భారతదేశం గురించి గాని, అసమ్ లో పరిస్థితి ని గురించి గాని తెలియదు, అర్ధం చేసుకోరు. అసమ్, భారతదేశం ల మధ్య అనుబంధం హృదయం, ఆత్మ ల వంటిది. శ్రీమంత శంకర్ దేవ్ విలువల తో అసమ్ కొనసాగుతోంది.

శ్రీమంత శంకర్ దేవ్ జీ..

కోటి-కోటి జన్మాంతరే జాహార్, కోటి- కోటి జన్మాంతరే జాహార్ |
ఆసే మహా పుణ్య రాశి. సి సి కదాచిత్ మనుష్య హోవయ, భారత్ వరిషే ఆసి..

అని మాట్లాడారు.

అనేక జన్మల నుండి నిరంతరం గా ధర్మాన్ని పాటించిన అదే వ్యక్తి, ఈ భారతదేశం లో జన్మించారు. ఇదే భావన అసమ్ అంతటా ఉంది, ఇదే భావన అసమ్ ప్రజల లో ఉంది. ఇదే స్ఫూర్తి ని అనుసరించి అసమ్ ప్రజలు, భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామం నుండి భారతదేశ పునర్నిర్మాణం వరకు తమ రక్తాన్ని, స్వేదాన్ని ధార పోసి శ్రమిస్తున్నారు. మన స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాల ను త్యాగం చేసిన పుణ్యపురుషులు నివసించిన ప్రాంతం ఇది. అసమ్ కు వ్యతిరేకం గా, జాతీయతకు వ్యతిరేకం గా పనిచేసే వారిని, వారికి మద్దతు పలికే వారిని ఈ దేశం ఎన్నటి కి సహించదు అని, క్షమించదు అని, అసమ్ ను ప్రేమించే వారు అందరి కి హామీ ని ఇవ్వడానికే నేను ఈ రోజు న ఇక్కడ కు వచ్చాను.

మిత్రులారా,

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు అనంతరం బయట నుండి వచ్చిన వారు అసమ్ లో స్థిరపడుతున్నారని, అసమ్ లో, ఈశాన్య ప్రాంతం లో కొన్ని శక్తులు వదంతులను వ్యాప్తి చేస్తున్నాయి. ఈ విధం గా ఏమీ జరుగదు అంటూ అసమ్ ప్రజల కు నేను హామీ ని ఇస్తున్నాను.

సోదర, సోదరీమణులారా,

అసమ్ ప్రజలతో కలసి నేను ఒక సాధారణ బిజెపి కార్యకర్త గా చాలా కాలం పనిచేశాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు తిరిగాను. ఇక్కడ ఉన్న నా స్నేహితుల నుండి భారత రత్న భూపేన్ హజారికా గారి ప్రసిద్ధమైన గీతాలను ఎల్లప్పుడూ వింటూ ఉండే వాడి ని. భూపేన్ హజారికా గారి తో నాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. అది ఎందుకంటే నేను గుజరాత్ లో జన్మించాను. భూపేన్ హజారికా, భారత రత్న భూపేన్ హజారికా మా గుజరాత్ కు అల్లుడు. దీని ని మేము గర్వం గా భావిస్తాము. ఆయన కుమారుడు, ఆయన పిల్లలు ఇప్పటికీ గుజరాతీ మాట్లాడుతారు. అందువల్ల నేను గర్వంగా భావిస్తాను. నేను ఈ క్రింది వాక్యాలు విన్నప్పుడు …

గోటయీ జీబోన్ బిసారిలేవు, అలేఖ్ దివఖ్ రాతీ

అహమ్ దేహర్ దరే నేపావూమ్, ఇమాన్ రహాల్ మాటీ

అసమ్ వంటి రాష్ట్రం, అసమ్ వంటి భూమి కి చెందిన ప్రజల నుండి ఇంత ప్రేమ ను పొందడం నిజం గా నా అదృష్టం గా భావిస్తున్నాను. మీ సంస్కృతి, భాష, వివిధ సమాజాల కు చెందిన ఆహారం ఎంత విశిష్టమైనవో నాకు తెలుసు. మీ ఆకాంక్ష లు, మీ ఆనందం, మీ విచారం.. అన్నీ నాకు పూర్తిగా తెలుసును. మీ భ్రమ లు, కోరిక లు అన్నీ ముగిశాయి. బోడో స్నేహితులు దగ్గరకు వచ్చారు. మిగిలిన వారి భ్రమలన్నీ కూడాను త్వరలోనే తొలగిపోతాయని నేను భావిస్తున్నాను.

మిత్రులారా,

గత ఐదేళ్లలోనూ, అంతకు ముందూ, అలాగే ప్రస్తుతం అసమ్ సేవల ను దేశం యావత్తూ స్వీకరించింది. అసమ్ సహా మొత్తం ఈశాన్య ప్రాంతాల కు చెందిన కళలు, సంస్కృతి, ఇక్కడి యువత ప్రతిభ, ఈ ప్రాంతం క్రీడా సంస్కృతి, దేశవ్యాప్తం గా, ప్రపంచ వ్యాప్తం గా జాతీయ ప్రసారమాధ్యమాల ద్వారా మొట్టమొదటి సారి గా ప్రచారం చేయడం జరిగింది. మీరు అందజేసిన మీ అభిమానం, మీ ఆశీస్సు లు, మీకు మరింత సేవ చేయడానికి నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాయి. మీరు అందజేసిన ఈ ఆశీర్వాదాలు వృథా కావు. ఎందుకంటే మీ దీవెన ల బలం అపారమైంది. మీ శక్తి పై విశ్వాసాన్ని ఉంచండి. మీ స్నేహితుల పై నమ్మకాన్ని ఉంచండి. కామాఖ్య అమ్మ వారి దీవెనల పై నమ్మకం ఉంచండి. కామాఖ్య అమ్మ వారి నమ్మకం, దీవెన లు మనల్ని అభివృద్ధి లో నూతన శిఖరాల కు తీసుకుపోతాయి.

మిత్రులారా,

కృష్ణ భగవానుడు గీత లో పాండవుల కు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. అది కూడా యుద్ధ రంగం లో. చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలు రెండు వైపుల నుండి దూసుకు వస్తున్నాయి. ఆ సమయం లో కృష్ణ భగవానుడు యుద్ధ రంగం లో చెప్పాడు, ఇది గీతలో ఉంది ..

నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ

ఈ మాటల కు నా భక్తులు ఎవరైతే ఏ జీవి ని కూడాను ద్వేషించరో వారు నన్ను చేరుకుంటారు అని భావం.

కాస్త ఊహించండి.. చరిత్రాత్మక మహాభారత యుద్ధ సమయం లో కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం ఏమిటంటే ఎవరి ని
ద్వేషించవద్దు అనేదే.

మీ మనస్సు లో ఏమాత్రం ద్వేషభావం ఉన్నా ఆ భావాన్ని, ఆ శతృత్వాన్ని తొలగించవలసిందిగా ఈ దేశం లో ప్రజల కు నేను చెబుతాను.

అందరి తో కలసి అభివృద్ధి పథం లోకి రండి, అందరూ అభివృద్ధి చెందడానికి సహకరించండి. హింస ద్వారా గతం లో ఏమీ సాధించలేదు, ఇక ముందు కూడా ఏమీ సాధించే అవకాశం లేదు.

మిత్రులారా,

నేను మరొకసారి బోడో సమాజాన్ని, అసమ్ ను, ఈశాన్య ప్రాంతాన్ని అభినందిస్తున్నాను. ఈ భారీ ప్రజా సమూహాని కి మరొక సారి నా శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తు లో ఇటువంటి దృశ్యాన్ని మళ్ళీ చూస్తానో లేదో నాకు తెలియదు. ఇది అసాధ్యం అని నాకు అనిపిస్తోంది. బహుశా భారతదేశం లో ఏ రాజకీయ నాయకుని కి గతం లో ఈ విధంగా ఆశీస్సులు అందుకొనే అవకాశం రాలేదు. భవిష్యత్తు లో కూడా ఏ రాజకీయ నాయకుడు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదాలు పొందగలడన్న నమ్మకం నాకు లేదు. నాకు నేను చాలా అదృష్టవంతుడి నని అనుకొంటున్నాను. మీరు చాలా ప్రేమ తో కూడిన ఆశీస్సుల ను నా మీద కురిపిస్తున్నారు.

ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమ.. ఇవే నాకు ప్రేరణ. దేశాని కి రాత్రింబగళ్లు ఏదైనా చెయ్యాలనే బలాన్ని ఇది నాకు ఇస్తుంది. నేను మీకు తగినంత గా కృతజ్ఞతల ను చెప్పలేక పోతున్నాను. నేను మీకు తగినంతగా ధన్యవాదాలు పలుకలేకపోతున్నాను. ఇప్పుడు మరొక్క మారు, ఈ యువకులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి ని విడచిపెట్టి అహింస మార్గాన్ని ఎంచుకొని ముందుకు వచ్చారు. నన్ను నమ్మండి; మీ నూతన జీవితం ప్రారంభమైంది. ఈ యావద్దేశం మిమ్ములను ఆశీర్వదిస్తోంది. ఈ దేశం లోని 130 కోట్ల ప్రజానీకం ఆశీస్సు లు మీ పైన ఉన్నాయి. ఇప్పటికి కూడాను ఇంకా తుపాకులు, ఆయుధాలు, పిస్టళ్ల పైన విశ్వాసం ఉంచి, ఈశాన్య ప్రాంతం, నక్సలైట్ ప్రాంతం, జమ్ము, కశ్మీర్ లలో నివసిస్తున్న వారు, నా బోడో సమాజానికి చెందిన యువత నుండి నేర్చుకోవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి నుండి ప్రేరణ ను, స్ఫూర్తి ని పొందండి, వెనుదిరిగి రండి, ప్రధాన జీవన స్రవంతి లో కలవండి, మెరుగైన జీవితాన్ని పొందండి, జీవితాన్ని సంతోషం గా గడపండి. ఈ ఒక్క అపేక్ష తో మరొక సారి భూ మాత కు, మీ అందరికి నమస్కరిస్తూ, ఈ మాతృ భూమి కోసం జీవించిన ప్రముఖ వ్యక్తుల కు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

అనేక ధన్యవాదాలు.

భారత్ మాతా కీ జయ్.

గట్టి గా పలకండి, మీ స్వరం 130 కోట్ల దేశ ప్రజల హృదయాల ను కదలించాలి.

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

మహాత్మ గాంధీ అమర్ రహే, అమర్ రహే !

మహాత్మ గాంధీ అమర్ రహే, అమర్ రహే !

మహాత్మ గాంధీ అమర్ రహే, అమర్ రహే !

మీకు అనేకానేక ధన్యవాదాలు.