అస్సాం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, జమ్ము & కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించి ఇతర వెనుకబడిన తరగతుల కేంద్రీయ జాబితాలో చేర్పు/సవరణలను నోటిఫై చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం (ఎన్ సి బి సి) సిఫారసు చేసిన మీదట, ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితాలో 25 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి మొత్తం 2479 ఎంట్రీలను (సిననిమ్ స్, ఉప- కులాలతో సహా) చేర్చేందుకు నోటిఫై చేయడమైంది. ఇటువంటి కడపటి నోటిఫికేషన్ 2016 సెప్టెంబర్ వరకు జారీ చేయడమైంది. ఇంతలో మరిన్ని కులాలు/ సముదాయాలను చేర్చాలంటూను, ఇంకా అస్సాం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, జమ్ము & కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల కు చెందిన ప్రస్తుత ఓబీసీ ల జాబితాలో దిద్దుబాటులు చేయాలంటూను ఎన్ సి బి సి నుండి సలహాలు అందాయి. తదనుగుణంగా జమ్ము & కశ్మీర్ (15 కొత్త చేర్పులు, 9 సిననిమ్ స్/ఉప- కులాలు, 4 దిద్దుబాటులు) సహా 8 రాష్ట్రాల విషయంలో ఎన్ సి బి సి సిఫారసుల మేరకు మొత్తం 28 మార్పులను నోటిఫై చేయడమైంది.
ఆయా కులాలు/సముదాయాలకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం అమలులో ఉన్నవిధానం ప్రకారం ప్రభుత్వ సేవలు మరియు పోస్టులతో పాటు కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు ఈ మార్పులు వీలు కల్పించగలుగుతాయి. అలాగే ఆయా కులాలు/సముదాయాలకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం ఇతర వెనుకబడిన తరగతులకు అందుబాటులో ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్కాలర్ షిప్ లు మొదలైన వాటిని పొందడానికి కూడా అర్హులవుతారు.
పూర్వరంగం
1993 ఎన్ సి బి సి చట్టం ప్రకారం ఇంద్రా సాహ్నీకేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఎన్ సి బి సి ని ఏర్పాటు చేశారు. ఇందులోని సెక్షన్ 9 (కమిషన్ విధివిధానాలు) ఈ కింది విషయాన్ని వెల్లడిస్తుంది:
1. ఓబీసీలోకి ఏవైనా కులాలు, ఉప-కులాలను జాబితాకు చేర్చాల్సి వచ్చినపుడు చేరాలనుకున్న వారి ఫిర్యాదులను వినాలి. వీటిపై విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి సరైన సూచనలు చేయాలి.
2. కమిషన్ ఇచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వం సాధారణంగా పాటించాల్సి ఉంటుంది.