Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అస్సాంలోని నామ్ రూప్ లో బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో బ్రౌన్ ఫీల్డ్ అమ్మోనియా – యూరియా కాంప్లెక్స్ నామ్ రూప్ IV ప్లాంటు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర క్యాబినెట్.. అస్సాంలోని నామ్ రూప్‌లో ఉన్న బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్ సీఎల్ప్రాంగణంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో కొత్తగా బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియాయూరియా కాంప్లెక్సు ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించిందిమొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,601.40 కోట్లునూతన పెట్టుబడి విధానం2012 (2014 అక్టోబర్ 7న సవరణలు చేశారుప్రకారం జాయింట్ వెంచర్ ద్వారా 70:30 రుణ ఈక్విటీ నిష్పత్తితో దీనిని ఏర్పాటు చేయనున్నారునామ్ రూప్‌IV ప్రాజెక్టును 48 నెలల్లో ప్రారంభించాలని ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీనితోపాటు.. ప్రభుత్వ సంస్థల విభాగం (డీపీఈమార్గదర్శకాలలో సూచించిన పరిమితుల సడలింపులో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్ఈక్విటీ భాగస్వామ్యం 18 శాతాన్నిఅలాగే నామ్ రూప్– IV ఫెర్టిలైజర్ ప్లాంటు ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించడం కోసం మంత్రి వర్గాల సమన్వయ కమిటీ ఏర్పాటును కూడా క్యాబినెట్ ఆమోదించింది.

 

ప్రతిపాదిత జాయింట్ వెంచర్ లో ఈక్విటీ నమూనా కింది విధంగా ఉండనుంది:

(i) అస్సాం ప్రభుత్వం: 40%

(ii) బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్ఎస్ఎల్):  11%

(iii) హిందుస్థాన్ ఉర్వరక్రసాయన్ లిమిటెడ్ (హెచ్ యూఆర్ఎల్): 13%

(iv) నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్):  18%

(v) ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్): 18%

ప్రత్యక్ష ఆస్తుల స్థానంలో బీవీఎఫ్ఎస్ఎల్ ఈక్విటీ వాటా ఉంటుంది.

ఈ ప్రాజెక్టు దేశంలోముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో దేశీయంగా యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందిఈశాన్య ప్రాంతంబీహార్పశ్చిమ బెంగాల్తూర్పు ఉత్తరప్రదేశ్జార్ఖండ్‌ లలో యూరియా ఎరువులకు పెరుగుతున్న డిమాండును ఇది తీరుస్తుందినామ్ రూప్IV యూనిట్ ను నెలకొల్పడం ద్వారా తక్కువ ఇంధనంతోనే మరింత ఎక్కువగా ఫలితాలను సాధించవచ్చుఇది ఈ ప్రాంత ప్రజలకు అదనంగా ప్రత్యక్షపరోక్ష ఉపాధి అవకాశాలను అందిస్తుందియూరియా విషయంలో దేశం స్వావలంబన సాధించాలన్న లక్ష్యాన్ని  సాధించడంలో ఇది దోహదపడుతుంది.  

 

***