అసోంలోని జోగీఘోపాలో బ్రహ్మపుత్ర (జాతీయ జలమార్గం-2)పై అంతర్దేశీయ జలమార్గ రవాణా (ఐడబ్ల్యూటీ) టర్మినల్‌ను ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ భూటాన్ ఆర్థిక మంత్రి శ్రీ ల్యోన్‌పో నాంగ్యాల్ దోర్‌జీతో కలసి, అసోంలోని జోగీఘోపాలో అంతర్దేశీయ జలమార్గ రవాణా (ఐడబ్ల్యూటీ) టర్మినల్‌ను ప్రారంభించారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుతో సంధానించిన, వ్యూహాత్మకంగా జోగీఘోపాలో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక టర్మినల్.. అసోంలోను, ఈశాన్య ప్రాంతాల్లోను లాజిస్టిక్స్ సదుపాయాల్ని, సరకుల చేరవేతకు అవకాశాల్ని మరింతగా పెంచుతూ భూటాన్, బంగ్లాదేశ్‌లకు అంతర్జాతీయ ప్రయాణాలలో విరామానికి ఉపయోగపడే ఓ ఓడరేవుగా కూడా నిలుస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ సోనోవాల్ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ –
‘‘మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్న, దేశ ప్రగతి సాధన, సమృద్ధిలలో అంతర్దేశీయ జలమార్గాల పాత్రను ప్రోత్సహిస్తూ ముందుకుపోవాలన్న మన ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గ మరొక విజయమిది’’ అని పేర్కొన్నారు.
A noteworthy addition in our quest for improving infrastructure as well as encouraging inland waterways for progress and prosperity. https://t.co/2heHuWxagw
— Narendra Modi (@narendramodi) February 18, 2025