Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అసమ్ లో 2022 వ సంవత్సరం లో దొంగతనం గా వేటాడిన ఘటన లు ఏవీ నమోదు కాకపోవడం తో, ఖడ్గ మృగాల సంరక్షణ దిశ లో ప్రజలు చేస్తున్న ప్రయాసల ను కొనియాడిన ప్రధాన మంత్రి


అసమ్ లో 2022వ సంవత్సరం లో వన్య మృగాల ను దొంగతనం గా వేటాడినటువంటి సంఘటన లు ఏవీ జరగలేదని తన దృష్టి కి వచ్చిన తరువాత, ఖడ్గ మృగాల సంరక్షణ దిశ లో చేసిన ప్రయాసల కు గాను ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి వెల్లడి చేస్తూ తాను ఒక ట్వీట్ లో –

 ‘‘ఇది ఒక బలే మంచిదైనటువంటి కబురు.  ఖడ్గ మృగాల ను పరిరక్షించడం కోసం రాబోయే కాలం లో ఏదైనా అపాయకరమైన స్థితి తలెత్తకుండా ముందుగానే తగిన జాగ్రత చర్యల ను తీసుకొని అసమ్ ప్రజలు అందించిన మార్గదర్శకత్వానికి గాను వారికి ఇవే ప్రశంస లు.’’ అని పేర్కొన్నారు.