Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అసమ్ ను ఏప్రిల్ 14 వ తేదీ నాడు సందర్శించనున్న ప్రధానమంత్రి


అసమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 14 వ తేదీ న సందర్శించనున్నారు.

 

ఇంచుమించు గా మధ్యాహ్నం 12 గంటల వేళ కు, ప్రధాన మంత్రి ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ కి చేరుకొని ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ కై కొత్త గా నిర్మాణం జరిగినటువంటి కేంపస్ ను పరిశీలిస్తారు. ఆ తరువాత జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో ఆయన పాల్గొని ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ ని మరియు మరో మూడు వైద్య కళాశాల లను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. ఆయన అసమ్ అడ్వాన్స్ డ్ హెల్థ్ కేర్ ఇనొవేశన్ ఇన్స్ టిట్యూట్ (ఎఎహెచ్ఐఐ) కి కూడా శంకుస్థాపన చేయడం తో పాటు అర్హత కలిగిన లబ్ధిదారుల కు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి-పిఎమ్ జెఎవై) కార్డు లను పంపిణీ చేయడం ద్వారా ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్అభియాన్ ను ప్రారంభిస్తారు.

 

గువాహాటీ ఉన్నత న్యాయస్థానం ప్లాటినమ్ జూబిలీ వేడుక ల కు గుర్తు గా గువాహాటీ లోని శ్రీమంత శంకర్ దేవ్ కళాక్షేత్ర లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి మధ్యాహ్నం సుమారు 2 గంటల 15 నిమిషాల వేళ కు పాలుపంచుకొంటారు.

 

సాయంత్రం 5 గంటల వేళ కు, ప్రధాన మంత్రి గువాహాటీ లోని సరుసజాయి స్టేడియమ్ కు చేరుకొంటారు. ఆయన అక్కడ ఏర్పాటైన ఒక సార్వజనిక కార్యక్రమాని కి అధ్యక్షత వహిస్తారు. పది వేల మంది కి పైగా ప్రదర్శనకారులు/బిహు నర్తకులు అక్కడ సమర్పించే ఒక ఆకర్షణీయమైన బిహు కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి తిలకిస్తారు. ఇదే కార్యక్రమం లో వివిధ అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయడమే కాకుండా, వాటి ని దేశ ప్రజల కు అంకితం కూడా చేస్తారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల లో నామ్ రూప్ లో 500 టిపిడి సామర్థ్యం కలిగిన మెథనాల్ ప్లాంటు యొక్క కార్యకలాపాల ను మొదలు పెట్టడం; పలాశ్ బాడీ మరియు సువల్ కుచీ లను కలుపుతూ బ్రహ్మపుత్ర నది మీద ఒక వంతెన నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేయడం; శివసాగర్ లోని రంగ్ ఘర్ యొక్క సుందరీకరణ పనుల కు శంకుస్థాపన చేయడం తో పాటు రేల్ వే పరియోజనల ను అయిదింటి ని దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం వంటివి కలిసి ఉంటాయి.

 

ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ లో ప్రధాన మంత్రి

 

మూడు వేల నాలుగు వందట కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన వివిధ పరియోజనల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు.

 

ఎఐఐఎమ్ఎస్, గువాహాటీ కార్యకలాపాలు మొదలు కావడం అసమ్ రాష్ట్రం తో పాటు దేశం లోని యావత్తు ఈశాన్య ప్రాంతం లో ప్రాముఖ్యం గల సందర్భాన్ని సూచిస్తుంది. ఇది ఆరోగ్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల ను దేశం అంతటా బలపరచడం కోసం ప్రధాన మంత్రి కనబరుస్తున్న నిబద్ధత కు సైతం ఒక నిదర్శన గా ఉంటుంది. ఈ ఆసుపత్రి నిర్మాణాని కి శంకుస్థాపన ను కూడా 2017 వ సంవత్సరం మే నెల లో ప్రధాన మంత్రే చేశారు. 1120 కోట్ల రూపాయల కు పైబడిన వ్యయం తో నిర్మించిన ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ లో 30 ఆయుష్ పడక లు సహా 750 పడక ల సామర్థ్యాన్ని కలిగివుండేటటువంటి ఒక అత్యాధునికమైన ఆసుపత్రి అని చెప్పాలి. ఈ ఆసుపత్రి లో ఏటా 100 మంది ఎమ్ బిబిఎస్ విద్యార్థుల ను చేర్చుకొనే ఏర్పాటు ఉంటుంది. దేశం లో ఈశాన్య ప్రాంతాల ప్రజల కు ప్రపంచ స్థాయి ఆరోగ్య సదుపాయాల ను ఈ ఆసుపత్రి అందిస్తుంది.

 

మెడికల్ కాలేజీలు మూడింటి ని సైతం దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేస్తారు. ఆయా కాలేజీల లో నల్ బాడీ మెడికల్ కాలేజీ ని 615 కోట్ల రూపాయల ఖర్చు తో, నాగావ్ మెడికల్ కాలేజీ ని 600 కోట్ల రూపాయల ఖర్చు తో మరియు కోక్ రాఝార్ మెడికల్ కాలేజీ ని 535 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. వీటి లో ఒక్కొక్క వైద్య కళాశాల కు అనుబంధం గా 500 పడక ల సామర్థ్యం కలిగినటువంటి బోధనాసుపత్రులు కూడా ఉంటాయి. ఈ బోధనాసుపత్రుల లో ఒపిడి/ఐపిడి సేవ లు, అత్యవసర సేవ లు, ఐసియు సదుపాయాలు, ఒటి మరియు రోగనిర్ధారణ సదుపాయాలు మొదలైన వాటి ని సమకూర్చడమైంది. ప్రతి మెడికల్ కాలేజీ లో 100 ఎమ్ బిబిఎస్ విద్యార్థుల ను చేర్చుకొనేందుకు ఏర్పాటు లు ఉంటాయి.

 

ప్రధాన మంత్రి లాంఛనప్రాయం గా ప్రారంభించే ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్ప్రచార ఉద్యమం ప్రతి ఒక్క లబ్ధిదారు ను చేరుకోవాలి అనేటటువంటి ఆయన దృష్టికోణాన్ని ఆచరణాత్మకం గా మలచే దిశ లో వేసే ఒక అడుగు కానుంది. అంతిమం గా అందరి కి సంక్షేమ పథకాలు అందాలి అనేది ప్రధాన మంత్రి దార్శనికత గా ఉంది. లబ్ధిదారుల ప్రతినిధులు ముగ్గురి కి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (ఎబి-పిఎమ్ జెఎవై) కార్డుల ను ప్రధాన మంత్రి పంపిణీ చేస్తారు. దీని కి తరువాయి గా, రాష్ట్రం లోని జిల్లాలు అన్నింటి లో సుమారు 1.1 కోట్ల ఎబి-పిఎమ్ జెఎవై కార్డుల పంపిణీ చోటు చేసుకొంటుంది.

 

 

అసమ్ అడ్వాన్స్ డ్ హెల్థ్ కేర్ ఇనొవేశన్ ఇన్ స్టిట్యూట్ (ఎఎహెచ్ఐఐ) కు శంకుస్థాపన అనేది ఆరోగ్యాని కి సంబంధించిన రంగాల లో ఆత్మనిర్భర్ భారత్మరియు మేక్ ఇన్ ఇండియాల సాధన దిశ లో ఒక ముందంజ కానుంది. దేశ ఆరోగ్య సంరక్షణ రంగం లో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం లో చాలా వరకు దిగుమతి చేసుకొని భిన్న ఉపయోగానికై అభివృద్ధి పరచడం జరుగుతోంది. ఈ ప్రక్రియల ను భారతదేశం స్థితిగతుల లో కొనసాగించడం బాగా ఖరీదు అయినటువంటి మరియు జటిలం అయినటువంటి ప్రక్రియలు గా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యం లో మనవైన సమస్యల కు మన సొంత పరిష్కార మార్గాల ను కనుగొనాలి అనే దృక్పథం తో ఎఎహెచ్ఐఐ ని ఆవిష్కరించడం జరుగుతోంది. దాదాపు గా 546 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం కానున్న ఎఎహెచ్ఐఐ మందులు మరియు ఆరోగ్య సంరక్షణ రంగాల లో అత్యాధునిక నూతన ఆవిష్కరణల కు, పరిశోధన కు మరియు అభివృద్ధి (ఆర్&డి) కి దోహద పడుతూ, దేశం లో ఆరోగ్యపరంగా అనుపమానమైనటువంటి సమస్యల ను గుర్తించి ఆ సమస్యల ను పరిష్కరించడం కోసం సరికొత్తవైనటువంటి సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని అభివృద్ధి పరచడాన్ని ప్రోత్సహిస్తుంది.

 

శ్రీమంత శంకర్ దేవ్ కళాక్షేత్ర లో ప్రధాన మంత్రి

 

గువాహాటీ ఉన్నత న్యాయస్థానం ప్లాటినమ్ జూబిలీ వేడుకల కు గుర్తు గా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరవుతారు.

 

అసమ్ పోలీసు విభాగం రూపుదిద్దిన అసమ్ కాప్మొబైల్ అప్లికేశన్ ను ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో ఆవిష్కరించనున్నారు. క్రైమ్ ఎండ్ క్రిమినల్ నెట్ వర్క్ ట్రాకింగ్ సిస్టమ్ (సిసిటిఎన్ఎస్) మరియు విఎహెచ్ఎఎన్ నేశనల్ రిజిస్టర్ ల యొక్క డాటా బేస్ నుండి నిందితుల ను మరియు వాహన అన్వేషణ ప్రక్రియల కు మార్గాన్ని ఈ ఏప్ సుగమం చేస్తుంది.

 

గువాహాటీ ఉన్నత న్యాయస్థాన్ని 1948 వ సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైకోర్టు 2013 వ సంవత్సరం మార్చి నెల లో మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర లకు విడి విడి గా ఉన్నత న్యాయస్థానాల ను ఏర్పరచే కన్నా క్రితం కాలం వరకు ఏడు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు అయిన అసమ్, నాగాలాండ్, మణిపుర్, మేఘాలయ, మిజోరమ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లకు ఉమ్మడి న్యాయస్థానం గా తన సేవల ను అందిస్తూ వచ్చింది. గువాహాటీ హైకోర్టు కు ప్రస్తుతం అసమ్, నాగాలాండ్, మిజోరమ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కు సంబంధించి న్యాయాధికార పరిధి ఉన్నది. దీని కి గువాహాటీ లో ప్రధాన ఆసనం, నాగాలాండ్ లోని కొహిమా, మిజోరమ్ లోని ఐజాల్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో మూడు శాశ్వత పీఠాలు ఉన్నాయి.

 

సరుసజాయి స్టేడియమ్ లో ప్రధాన మంత్రి

 

పది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల కు పైగా విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేయనున్నారు.

 

పలాశ్ బాడీ, సువల్ కుచీ లను కలుపుతూ బ్రహ్మపుత్ర నది మీద నిర్మాణం జరిగే ఒక వంతెన కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సేతువు ఆ ప్రాంతం లో ఎంతో అవసరం అయినటువంటి కనెక్టివిటీ ని అందించనుంది. డిబ్రూగఢ్ లో నామ్ రూప్ ప్రాంతం లో 500 టిపిడి సామర్థ్యం కలిగిన మెథనాల్ ప్లాంటు కార్యకలాపాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ ప్రాంతం లోని వేరు వేరు సెక్శన్ లలో డబ్లింగ్, ఇంకా విద్యుతీకరణ పరియోజన లు సహా మొత్తం అయిదు రేల్ వే ప్రాజెక్టుల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

 

ఈ రేల్ వే పరియోజనల లో దిగారు-లుమ్ డింగ్ సెక్శన్; గౌరీపుర్-అభయపురి సెక్శన్; న్యూ బొంగైగాఁవ్- ధూప్ ధర సెక్శన్ యొక్క డబ్లింగ్ పనులు, రాణినగర్ జల్ పాయిగుడీ-గువాహాటీ సెక్శన్ యొక్క విద్యుతీకరణ; సెన్చోవా -శీల్ ఘాట్ టౌన్ మరియు సెంచోవా- శీల్ ఘాట్ టౌన్ మరియు సెంచోవా- మైరాబాడీ సెక్శన్ యొక్క విద్యుతీకరణ లు భాగం గా ఉన్నాయి.

 

శివసాగర్ లోని రంగ్ ఘర్ యొక్క సుందరీకరణ పరియోజన కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది ఆ ప్రదేశం లో పర్యటక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయనుంది. రంగ్ ఘర్ సుందరీకరణ ప్రాజెక్టు ద్వారా ఒక భారీ జలాశయం వద్ద ఫౌంటెన్-శో తో పాటు, అహోమ్ రాజవంశం యొక్క చరిత్ర ను కళ్ళ కు కట్టే నిర్మాణం, సాహసిక పడవ ప్రయాణాల కు ఆలవాలం గా ఉండే ఒక బోట్ హౌస్, స్థానిక చేతివృత్తుల ను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఒక ఆర్ టిజేన్ విలేజ్, ఆహార ప్రియుల కోసం విభిన్నమైన స్థానిక వంటకాలు మొదలైనవి అందుబాటు లోకి వస్తాయి. శివసాగర్ లో నెలకొన్న రంగ్ ఘర్ అహోమ్ సంస్కృతి, సంప్రదాయాల ను ప్రతిబింబించేటటువంటి ప్రముఖమైన కట్టడాల లో ఒకటి గా విరాజిల్లుతోంది. అహోమ్ రాజు శ్రీ స్వర్గదేవ్ ప్రమత్త సింఘ 18వ శతాబ్దం లో దీని ని నిర్మింప చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక మహా బిహు నృత్య ప్రదర్శన ను కూడా చూస్తారు. అసమ్ కు చెందిన బిహు నాట్యాన్ని అక్కడి ప్రజల సాంస్కృతిక కళారూపం గా పదుగురి కి చాటి చెప్పడం కోసమని ఈ నృత్య ప్రదర్శన ను ప్రత్యేకం గా నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం లో 10,000 మంది కి పైగా కళాకారులు ఒకే ప్రదేశం లో గుమికూడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఒకే ప్రదేశం లో బిహు నృత్యం తాలూకు భారీ ప్రదర్శన కేటగిరీ లో కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డు ను సాధించే ధ్యేయం తో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనిలో రాష్ట్రం లోని 31 జిల్లాల కు చెందిన కళాకారులు పాలుపంచుకోనున్నారు.

 

 

***