Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అవస్థాపన వ్యయాన్ని పెంచేందుకు బడ్జెట్ నుండి అదనపు నిధులను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం


అవస్థాపన సంబంధిత వ్యయాన్ని పెంచేందుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 31,300 కోట్ల నిధులను సమీకరించేందుకు మరియు ఎక్స్ ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ (ఇ బి ఆర్) నుండి రూ. 16,300 కోట్ల అసలును, వడ్డీని భారత ప్రభుత్వం సర్వీస్ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

రూ. 31,300 కోట్ల ఇ బి ఆర్ లో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి ఎఫ్ సి), ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐ ఆర్ ఇ డి ఎ), ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ డబ్ల్యు ఎ ఐ), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (ఎన్ ఎ బి ఎ ఆర్ డి) లు సమీకరించే నిధులకు భారత ప్రభుత్వం ద్రవ్య సహాయం చేయాలని ప్రతిపాదించారు. దీని అర్థం, పి ఎఫ్ సి, ఐ ఆర్ ఇ డి ఎ, ఐ డబ్ల్యుఎ ఐ మరియు ఎన్ ఎ బి ఎ ఆర్ డి లు సేకరించే రూ. 16,300 కోట్ల ఇ బి ఆర్ కు సంబంధించి అసలును, వడ్డీని భారత ప్రభుత్వం ఆయా మంత్రిత్వ శాఖలు/విభాగాల అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన బడ్జెట్ సర్దుబాట్ల ద్వారా తానే భరిస్తుంది అని.

కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టే ఖర్చును పెంచడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి మరింత తోడ్పాటును అందించేందుకు, మరింత స్థిరమైన వృద్ధి కోసం చేసే వ్యయం తాలూకు రాబడి – మూలధనం మిశ్రణాన్ని మెరుగుపరచేందుకు ఉద్దేశించిన నిర్ణయమిది.

పూర్వ రంగం:

ఏ దేశంలోనైనా నిలకడైన వృద్ధిని నిర్ధారించే కీలకమైన కొలబద్దలలో అవస్థాపన వ్యయం ఒకటి. దీనిని కొలిచేందుకు మొత్తం వ్యయంలో మూలధన వ్యయం నిష్పత్తిని ఆధారంగా తీసుకుంటారు. ఈ పద్ధతికి అనుగుణంగానే 2016 – 17 బడ్జెట్ ఉపన్యాసంలో ఒక ప్రకటనను వెలువరించారు. ఆ ప్రకటన ప్రకారం.. ప్రభుత్వం 2016- 17 సంవత్సరంలో బాండ్ల రూపంలో ఎన్ హెచ్ ఎ ఐ, పి ఎఫ్ సి, ఆర్ ఇ సి, ఐ ఆర్ ఇ డి ఎ, ఎన్ ఎ బి ఎ ఆర్ డి మరియు ఇన్ లాండ్ వాటర్ అథారిటీ లు రూ. 31,300 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇస్తుంది.