ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి 2021 సెప్టెంబన్ 14 న మధ్యాహ్నం 12 గంటల కు శంకు స్థాపన చేయనున్నారు. తరువాత ఇదే కార్యక్రమం లో ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ప్రధాన మంత్రి రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ ల ప్రదర్శన నమూనాల ను సైతం సందర్శిస్తారు.
రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ ని గురించిన వివరాలు:
స్వాతంత్య్ర సమర యోధుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త అయిన రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ గారి స్మృతి లో రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్శిటీ ని ఏర్పాటు చేస్తోంది. అలీగఢ్ లోని కోల్ తహసీల్ పరిధి లో లోధా మరియు ముసెపూర్ కరీమ్ జరౌలీ గ్రామాల తాలూకు 92 కు పైగా ఎకరాల విస్తీర్ణం లో ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం జరుగుతోంది. అలీగఢ్ డివిజన్ లోని 395 కళాశాల లు దీనికి అనుబంధం గా ఉంటాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించిన వివరాలు:
ఉత్తర్ ప్రదేశ్ లో ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ను స్థాపించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి 2018, ఫిబ్రవరి 21న లఖ్‌నవూ యూపి ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించిన సందర్భం లో ప్రకటించారు. ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో మొత్తం 6 నోడ్ లను స్థాపించాలని పథక రచన చేశారు. ఆ ఆరు నోడ్ లు ఏవేవి అంటే.. అలీగఢ్, ఆగ్రా, కాన్ పుర్, చిత్రకూట్, ఝాంసీ, ఇంకా లఖ్‌నవూ. అలీగఢ్ నోడ్ పరిధి లో భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది. ఈ నోడ్ లో 1245 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే 19 సంస్థల కు భూమి ని కేటాయించడమైంది.
రక్షణ సంబంధి ఉత్పత్తుల రంగం లో దేశాన్ని స్వావలంబన యుతం గా తీర్చిదిద్దడం లోను, ‘మేక్ ఇన్ ఇండియా’ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం లోను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ దోహదపడనుంది.
ఈ కార్యక్రమాని కి ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు.
***