Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అర్థచక్రాసన ను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్థ చక్రాసన లేదా సగం చక్రం భంగిమ తో కూడిన ఒక వీడియో క్లిప్ ను శేర్ చేశారు. మంచి హృదయం కోసం మరియు మెరుగైన రక్త ప్రసరణ కోసం ఈ భంగిమ ను అందరూ అభ్యసించండి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

యోగ అంతర్జాతీయ దినం యొక్క పదో సంచిక త్వరలో సమీపించనుండగా శేర్ చేసిన ఈ వీడియో క్లిప్, నిలబడిన భంగిమ లో ఆచరించవలసిన యోగాసన దశలను గురించి ఆంగ్ల భాష లో మరియు హిందీ భాష లో విపులంగా వివరిస్తుంది.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

‘‘మంచి ఆరోగ్యం కోసం చక్రాసన ను అభ్యసిస్తూ ఉండగలరు. ఇది గుండెకాయకు ఎంతో మేలు చేయడం తో పాటు రక్త ప్రసరణ ను మెరుగుపరచుకోవడం లో సహాయకారి గా ఉంటుంది.’’

‘‘క్రమం తప్పక చక్రాసనాన్ని అభ్యసించడం చేస్తూ ఉండడం వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతం గా ఉంచుకోవడం లో చాలా సాయం అంది వస్తుంది. ఇది హృదయాన్ని ఆరోగ్యవంతమైందిగా ఉండేటట్టు చూస్తుంది, అంతేకాక రక్క ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది కూడాను.’’

 

 

 

***

DS/RT