Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సోదరీమణులు తమిళంలో దేశభక్తి గీతాన్నిఆలాపించడం చూసి హర్షాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


 

శ్రీ సుబ్రహ్మణ్య భారతి తమిళ భాష లో రాసినటువంటి ఓ దేశభక్తి గీతాన్ని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సోదరీమణులు పాడడాన్ని చూసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకు గాను తన హర్షాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నేను దీనిని చూసినందుకు గాను సంతోషిస్తున్నాను; మరి ఇది నాకు గర్వకారణం గా అనిపిస్తున్నది. తమిళం లో పాడడం ద్వారా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను పెంపొందింప చేసినందుకు గాను అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మన యువ శక్తి తాలూకు ఈ ప్రకాశవంతమైన తారల కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.

 

*****

 

DS/TS