Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అయ్య వైకుండ స్వామికల్ ‌కు నివాళులర్పించిన – ప్రధానమంత్రి


ఈ రోజు అయ్య వైకుండ స్వామికల్‌ జయంతి సందర్భంగా,  ప్రధానమంత్రి  శ్రీ నరేంద్రమోదీ, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ మేరకు, ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, “19 వ శతాబ్దపు గొప్ప ఆలోచనాపరుడు, సామాజిక సంస్కర్త శ్రీ అయ్య వైకుండ స్వామికల్ జయంతి సందర్భంగా, ఆయనకు నా హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. సామాజిక అడ్డంకులను అధిగమించడానికీ, ప్రజలను సమైక్య పరచడానికీ, ఆయన బోధనలు, సమాజానికి ఎంతగానో సహాయపడ్డాయి. సమానత్వంపై ఆయన నొక్కి చెప్పిన విధానం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది.” అని, పేర్కొన్నారు.

 

*****