అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తరువాత నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటంతో నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం. ఈ దివ్యమైన రామాలయం వికసిత భారతదేశ సంకల్ప సాధనకు పెద్ద ప్రేరణగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను ” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.
***
अयोध्या में रामलला की प्राण-प्रतिष्ठा की प्रथम वर्षगांठ पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। सदियों के त्याग, तपस्या और संघर्ष से बना यह मंदिर हमारी संस्कृति और अध्यात्म की महान धरोहर है। मुझे विश्वास है कि यह दिव्य-भव्य राम मंदिर विकसित भारत के संकल्प की सिद्धि में एक… pic.twitter.com/DfgQT1HorT
— Narendra Modi (@narendramodi) January 11, 2025