Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అయోధ్యలోని కొత్తగా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిరంలో జనవరి 22 వ తేదీన శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్  లో శ్రీ రామ్  లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆహ్వానాన్ని శ్రీ రామజన్మభూమి ట్రస్ట్ నుంచి  ప్రధానమంత్రి అందుకున్నారు. 

ఈ చారిత్రకమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అన్ని ఆధ్యాత్మిక, మత వర్గాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే అన్ని వర్గాల, గిరిజన వర్గాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తారు. 

శ్రీరామ్ జన్మభూమి మందిర్ నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో కూడా ప్రధానమంత్రి సంభాషిస్తారు. అలాగే భగవాన్ శివుని పురాతన ఆలయాన్ని పునరుద్దరించిన కుబేర్ తిలను కూడా ప్రధానమంత్రి సందర్శిస్తారు. పునరుద్దరించిన ఆలయాన్ని దర్శించి అయన పూజలు నిర్వహిస్తారు.

అద్భుతమైన శ్రీ రామ జన్మభూమి మందిరాన్ని సాంప్రదాయిక నగర శైలిలో నిర్మించారు. ఆలయం నిడివి (తూర్పు-పడమర) 380  అడుగులు కాగా వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయి. ఈ స్తంభాలు, గోడలపై హిందూ దేవతా మూర్తులు, దేవుళ్ళు, దేవతల చిత్రాలు ఆకర్షణీయంగా చెక్కారు. దిగువ అంతస్తులోని గర్భ గుడిలో భగవాన్ శ్రీరాముని బాల్య దశలోని విగ్రహం (శ్రీ రామ్ లల్లా విగ్రహం) ఏర్పాటు చేశారు.

మందిర ప్రవేశ ద్వారం తూర్పు వైపున ఉంది. సింగ్ ద్వార్ ద్వారా 32 మెట్లు ఎక్కి ఈ ద్వారాన్ని చేరవచ్చు. మందిర్ లో ఐదు మందిరాలు ఉన్నాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన్ మండపం. మందిర సమీపంలో చారిత్రకమైన బావి (సీత కూప్) ఉంది. మందిర్ కాంప్లెక్స్ నైరుతి దిక్కులో కుబేర్ తిల ఉంది. అక్కడ భగవాన్ శివుని పురాతన మందిరాన్ని, జటాయు విగ్రహాన్ని  పునరుద్ధరించారు.

మందిరం పునాదిని 14 మీటర్ల మందమైన రోలర్ కంపాక్ట్డ్ కాంక్రెట్ తో (ఆర్ సిసి) నిర్మించారు. దీనికి కృత్రిమ రాయి రూపం వచ్చింది. మందిర నిర్మాణంలో ఎక్కడ ఇనుము ఉపయోగించలేదు. భూమి నుంచి వచ్చే తేమ నుంచి రక్షణకు 21 అడుగుల ఎత్తు గల ప్లింత్ ను గ్రానైట్ తో నిర్మించారు.  మందిరానికి మురుగు నీటి శుద్ధి  శుద్ధి ప్లాంట్, జల శుద్ధి ప్లాంట్, అగ్ని మాపకానికి నీటి సరఫరా సదుపాయం, స్వతంత్ర పవర్ స్టేషన్ ఉన్నాయి. మన దేశానికీ చెందిన సాంప్రదాయిక, దేశీయ టెక్నాలజీని ఉపయోగించి మందిరాన్ని నిర్మించారు.