Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమ్ రేలీ లో జ‌రిగిన స‌హ‌కార్ స‌మ్మేళ‌న్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


అమ్ రేలీ లో కొత్త‌గా నిర్మించిన ఎపిఎమ్‌సి మార్కెట్ యార్డును ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అమ‌ర్ డెయిరీ లో ఒక కొత్త ప్లాంటును కూడా ఆయ‌న ప్రారంభించారు. తేనె ఉత్ప‌త్తి ప్లాంటుకు పునాది రాయిని వేశారు.

అమ్ రేలీ లో జ‌రిగిన ‘స‌హ‌కార్ స‌మ్మేళ‌న్’ లో ప్ర‌ధాన మంత్రి పాల్గొని ప్ర‌సంగిస్తూ, యువత ముందుకు వ‌చ్చి స‌హ‌కార రంగంలో నాయ‌క‌త్వ బాధ్య‌త‌ను స్వీక‌రించ‌డం చూసి తాను సంతోషిస్తున్న‌ట్లు తెలిపారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వీబాధ్యతలను తాను నిర్వ‌హించిన కాలంలో సౌరాష్ట్ర ప్రాంతంలో పాడి సంఘాలు ఎలా వృద్ధి చెందిందీ ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

వ్య‌వ‌సాయ‌దారుల‌కు e-NAM Yojana ప్ర‌యోజ‌న‌కారిగా ఉంటోంద‌ని, ఇది మ‌రింత మెరుగైన విప‌ణుల‌ను వారి అందుబాటులోకి తీసుకు వ‌స్తోంద‌ని ఆయ‌న చెప్పారు. సౌరాష్ట్ర ప్రాంత ప్ర‌జ‌ల జీవ‌నాన్ని మార్చివేసే సత్తా నీలి విప్ల‌వానికి, తీపి (తేనె) విప్ల‌వానికి ఉందని ఆయ‌న అన్నారు.

వ్య‌వ‌సాయ‌దారుల అవ‌స‌రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం గ‌మ‌నిస్తూ, వారి స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌తిస్పందిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.