Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమ్మ 70 వ పుట్టిన రోజు సందర్భం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

అమ్మ 70 వ పుట్టిన రోజు సందర్భం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


అమ్మ అని అంతా పిలచుకొనేటటువంటి మాత అమృతానందమయి జీ 70 వ పుట్టిన రోజు సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

 

 

అమృతానందమయి జీ కి ఆమె 70వ జన్మదినం సందర్భం లో ఆమె కు దీర్ఘాయుష్షు కలగాలని, ఆరోగ్యవంతమైన జీవనం ఆమె కు లభిచాలని ప్రధాన మంత్రి ఆకాంక్షిస్తూ, తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సేవ కు మరియు ఆధ్యాత్మికత కు మారు పేరు గా ఆమె ఉన్నారు అని ఆయన అన్నారు. ప్రపంచం అంతటా ప్రేమ ను మరియు కరుణ ను ప్రసరింప చేయాలన్న ఆమె ఉద్యమం నిరంతరం ముందుకు సాగిపోతూ ఉండాలన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు. అమ్మ అనుచరులు సహా వివిధ జీవన రంగాల కు చెందిన వారు జతపడ్డ సభ లో ప్రతి ఒక్కరి కి అభినందనల ను మరియు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

 

అమ్మ తో ముప్ఫై సంవత్సరాల కు పైబడి అనుబంధం తన కు ఉన్న విషయాన్ని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, కచ్ఛ్ లో భూకంపం సంభవించిన అనంతరం చాలా కాలం పాటు ఆమె తో కలసి పని చేసిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు. అమ్మ 60 వ పుట్టిన రోజు ను అమృతపురి లో జరుపుకొన్న సంగతి తనకు గుర్తు ఉందన్నారు. ‘‘ఈ రోజు కు కూడా అమ్మ యొక్క చిరునవ్వు తో కూడినటువంటి మోము లో ఆప్యాయత మరియు వాత్సల్యపూరితమైనటువంటి స్వభావం మునుపటి వలెనే తొణికిసలాడుతున్నాయి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన 10 సంవత్సరాల లో అమ్మ యొక్క కార్యాలు మరియు ప్రపంచం మీద ఆమె ప్రసరిస్తున్నటువంటి ప్రభావం ఇంతలంతలు గా వృద్ధి చెందాయి అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, అమ్మ సమక్షం లో హరియాణా లోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రారంభించిన ముచ్చట ను జ్ఞప్తి కి తెచ్చారు. ‘‘అమ్మ యొక్క ఉనికి ని గురించి, అమ్మ యొక్క ఆశీస్సు ల తాలూకు వర్చస్సు ను గురించి మాటల లో చెప్పడం కష్టం, వాటిని మనం కేవలం అనుభూతి చెందుతాం’’ అని ఆయన అన్నారు. ప్రేమ కు, దయ కు, సేవ కు మరియు త్యాగాని కి మారుపేరు గా అమ్మ ఉన్నారు. మరి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని అమ్మ నిలబెడుతున్నారు అని ఆయన పునరుద్ఘాటించారు.

 

 

‘‘అది ఆరోగ్య రంగం కావచ్చు లేదా విద్య రంగం కావచ్చు, అమ్మ యొక్క మార్గదర్శకత్వం లో నడుస్తున్న ప్రతి ఒక్క సంస్థ మానవ సేవ ను మరియు సామాజిక సంక్షేమాన్ని సరిక్రొత్త శిఖరాల కు తీసుకు పోయాయి’’ అని, దేశ, విదేశాల లో అనేక సంస్థల ను ఆరంభించి వాటిని ప్రోత్సహించే విషయం లో అమ్మ తీసుకొంటున్న చొరవ ను గురించి ప్రధాన మంత్రి నొక్కి పలికారు. దేశం లో మొదలైన స్వచ్ఛత సంబంధి ఉద్యమాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ఉద్యమాన్ని సఫలం చేసేందుకు ముందడుగు వేసిన ప్రముఖుల లో ఒకరు గా అమ్మ ఉన్నారని పేర్కొన్నారు. గంగ నది తీర ప్రాంతాల లో టాయిలెట్ లను నిర్మించడం కోసం వంద కోట్ల రూపాయల ను ఆమె చందా గా కూడా ఇచ్చారు, దీనితో స్వచ్ఛత కు ఒక క్రొత్త శక్తి అందింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘అమ్మ కు ప్రపంచవ్యాప్తం గా అనుచరులు ఉన్నారు, మరి ఆమె భారతదేశం యొక్క ప్రతిష్ట ను మరియు భారతదేశం యొక్క విశ్వసనీయత ను సదా బలపరుస్తున్నారు.’’ అని ఆయన అన్నారు. ఎప్పుడైతే ప్రేరణ అంత ఘనం గా ఉంటుందో, అప్పుడు ప్రయాస లు సైతం ఘనం గా మారిపోతాయి.’’ అని ఆయన అన్నారు.

 

అభివృద్ధి సాధన అనేది మనుషులు ప్రధానం గా ఉండాలి. భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానం ఇది. దీనికి అమ్మ వంటి ప్రముఖులు ఒక ప్రతిబింబం వలె నిలుస్తున్నారు; భారతదేశం అనుసరిస్తున్నటువంటి ఈ అభివృద్ధి విధానాని కి మహమ్మారి అనంతరం వర్తమాన కాలం లో ఆమోదం లభిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. అశక్తుల కు శక్తి ని ఇవ్వాలి, ఆదరణ కు నోచుకోని వర్గాల వారి కి పెద్ద పీట ను వేయాలి అంటూ అమ్మ ఎల్లవేళ ల మానవీయ యజ్ఞాన్ని చేస్తున్నారు ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంటు నారీ శక్తి వందన్ అధినియమ్ను ఆమోదించడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, మహిళల ను కేంద్ర స్థానం లో నిలుపుతూ అభివృద్ధి అనేది చోటు చేసుకోవడం ముఖ్యం అనే సంకల్పం తో భారతదేశం ముందుకు సాగుతోంది. మరి భారతదేశం ఎదుట అమ్మ వంటి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం నిలచి వుంది అని ఆయన చెప్పారు. ప్రపంచం లో శాంతి ని మరియు ప్రగతి ని వ్యాప్తి చేయడం కోసం అమ్మ యొక్క అనుచర గణం ఇదే రీతి న వారి కార్యాల ను ముందుకు తీసుకు పోతూ ఉంటారన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేసి, తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

***

DS/TS