Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు: ప్రధానమంత్రి అభినందనలు


యునైటెడ్ స్టేట్స్‌‌ ఆఫ్ అమెరికాకు  47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్  పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి, యునైటెడ్ స్టేట్స్‌కు మధ్య సంబంధాలను బలపర్చడం కోసం, అలాగే ప్రపంచానికి  మరింత మెరుగైన భవిష్యత్తును అందించడం కోసం అధ్యక్షుడు  ట్రంప్‌తో కలిసి పనిచేయాలని ఉందన్న తన అభిలాషను ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ట్రంప్ పదవీకాలం ఫలప్రదం కావాలంటూ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (@realDonaldTrump), మీరు అమెరికా 47వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. మీతో మరోసారి కలిసి పనిచేయాలని, మన రెండు దేశాలకు మేలు చేయడంతోపాటు ప్రపంచానికి మరింత మెరుగైన భవిష్యత్తు కూడా లభించేలా కృషిచేయాలన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. మీ భావి పదవీకాలం సఫలమవ్వాలని కోరుకుంటూ మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’

 

 

***

MJPS/SR