Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికా సంయుక్త రాష్ర్టాల అధ్య‌క్షుడితో ప్ర‌ధాని టెలిఫోన్ సంభాష‌ణ‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం అమెరికా సంయుక్త రాష్ర్టాల అధ్య‌క్షుడు శ్రీ బరాక్ ఒబామా వ‌ద్ద నుంచి టెలిఫోన్ కాల్ అందుకున్నారు. ఇటీవ‌ల కాలిఫోర్నియాలో తుపాకి కాల్పుల ఘ‌ట‌నలో ప‌లువురు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ప్ర‌ధాని త‌న సంతాపాన్నిఅధ్య‌క్షుడు ఒబామాకు తెలియజేశారు. ఇదే సంభాష‌ణ‌లో.. ప్యారిస్‌లో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ21) స‌మావేశ పురోగతి ప్రస్తావనకు వచ్చింది. వాతావ‌ర‌ణంలో మార్పుల‌కు సంబంధించిన అంశాల‌పై ప్యారిస్ స‌మావేశంలో దృఢ‌మైన చిత్త‌శుద్ధిని క‌న‌బ‌ర‌చాల‌ని ఉభ‌య నేత‌లు భావించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్ర‌గ‌తి ప్ర‌క్రియ‌ను ఆటంక‌ప‌ర‌చ‌కుండానే.. ఈ క్రమంలో నిర్మాణాత్మ‌క‌మైన‌ భాగ‌స్వామ్యానికి బాట వేయాల‌ని ఇరువురు నేత‌లు ఓ అవగాహనకు వచ్చారు. తరచుగా తామిద్దరం ఒక‌రితో మ‌రొక‌రు మాటామంతి జరుపుతుండాలని కూడా వారు ఒక అంగీకారానికి వ‌చ్చారు.