Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదం అంతులేని దు:ఖాన్ని కలిగించింది. ఈ విషాద ఘటన అతి హృద‌య‌విదారకమైనటువంటి ఘటన. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వారి యొక్క కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. నేను అధికారులతో మాట్లాడి, సత్వర సహాయ కార్యకలాపాలను చేపట్టవలసిందంటూ వారికి సూచించాను’’ అంటూ ప్రధాన మంత్రి తన మనోభావాలను ట్విటర్ ద్వారా వెల్లడించారు.

**