Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘అమృత్మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారతదేశం నూతన శిఖరాల కు చేరుకొనేటట్టుచూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారని నేనుఆశాభావం తో ఉన్నాను: ప్రధాన మంత్రి


భారతదేశం తన ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారత్ నూతన శిఖరాల కు చేరుకొనేటట్టు చూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారనే ఆశాభావం తో నేను ఉన్నాన ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘‘ భారతదేశం ‘అమృత్ మహోత్సవ్’ వేడుక లు ఆరంభం అవుతున్న ఆగస్టు నెల లో ప్రవేశిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణం లో భారతదేశం లో ని ప్రతి ఒక్కరి ని ఉత్సాహపరచే అనేక ఘటనల ను మనం ఇప్పటికే చూసి ఉన్నాము. రెకార్డ్ స్థాయి లో టీకాల ను ఇప్పించే కార్యక్రమం చోటు చేసుకొంది. అలాగే, అధికం గా నమోదైన జిఎస్ టి సంఖ్య లు కూడా ఆర్థిక కార్యకలాపాలు శక్తిపూర్ణం గా ఉన్నాయి అనే సంకేతాన్ని అందిస్తున్నాయి.

ఒలింపిక్స్ లో పి.వి. సింధు తనకు దక్కవలసిన ఒక చక్కని పతకాన్ని గెలుచుకోవడం ఒక్కటే కాకుండా, పురుషుల తో పాటు మహిళల హాకీ జట్ల పక్షాన చరిత్రాత్మక ప్రయాసల ను మనం గమనించాం. భారతదేశం తన ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటూ ఉన్నటువంటి సందర్భం లో భారత్ నూతన శిఖరాల కు చేరుకొనేందుకు పూచీ పడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారనే ఆశాభావం తో నేను ఉన్నాను. ’’ అని పలు ట్వీట్ ల లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH