Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అబేయి లో యుఎన్ఐఎస్ఎఫ్ఎ తాలూకుయునైటెడ్ నేశన్ మిశన్ లో భాగం గా భారతీయ సేన తన అతి పెద్దదైనటువంటి మహిళాశాంతిపరిరక్షక సేనాదళాన్ని పంపినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


అబేయి లో యుఎన్ఐఎస్ఎఫ్ఎ యొక్క యునైటెడ్ నేశన్ మిశన్ కు అతి పెద్దది అయినటువంటి మహిళా శాంతిపరిరక్షక సేనాదళాన్ని పంపించినందుకు గాను భారతీయ సేన ను చూస్తే తనకు గర్వంగా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళాల లో చురుకు గా పాలుపంచుకొనేటటువంటి ఒక ఆనవాయితీ భారతదేశాని కి ఉంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఎడిజి పిఐ – ఇండియన్ ఆర్మీ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఒక ట్వీట్ లో –

‘‘దీనిని చూసి గర్వపడుతున్నాను.

ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళాల లో క్రియాశీలమైన రీతి న పాలుపంచుకొనేటటువంటి ఒక సంప్రదాయాన్ని భారతదేశం పాటిస్తోంది. మన నారీ శక్తి యొక్క భాగస్వామ్యం మరింత సంతోషాన్ని ఇచ్చేది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST