Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అబూ ధాబీ క్రౌన్ ప్రిన్స్ తో తో టెలిఫోన్ లో సంభాషించిన ప్ర‌ధాన‌ మంత్రి


అబూ ధాబీ యొక్క క్రౌన్ ప్రిన్స్ శేఖ్ మొహమద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడి, ఈద్-ఉల్-ఫిత్ర్ సందర్భం లో యుఎఇ యొక్క ప్రజల కు మరియు యుఎఇ యొక్క ప్రభుత్వాని కి శుభాకాంక్షలు తెలిపారు.

కోవిడ్-19 విశ్వమారి స్థితి తలెత్తిన కాలం లో ఇరు దేశాల మధ్య ప్రభావశీల సహకారం నెలకొనడం పట్ల నేత లు సంతృప్తి ని వ్యక్తం చేశారు. యుఎఇ లో నివసిస్తున్న భారతదేశ పౌరుల కు అందిస్తున్న సహకారానికి గాను క్రౌన్ ప్రిన్స్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.

యుఎఇ యొక్క ప్రజానీకానికి, యుఎఇ యొక్క రాజ కుటుంబానికి మరియు యుఎఇ యొక్క క్రౌన్ ప్రిన్స్ కు మంచి ఆరోగ్యం మరియు శ్రేయం ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

**********