Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అప్లైడ్ మెటీరియల్స్ సీఈవో గారీ. ఈ. డికర్సన్ తో ప్రధాని భేటీ

అప్లైడ్ మెటీరియల్స్ సీఈవో  గారీ. ఈ. డికర్సన్ తో ప్రధాని భేటీ


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వాషింగ్టన్ డీసీ లో అప్లైడ్ మెటీరియల్స్  ప్రెసిడెంట్, సీఈవో  గారీ.ఈ.డికర్సన్ తో భేటీ అయ్యారు.  .

భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను బలోపేతం చేయటానికి సహకరించాల్సిందిగా అప్లైడ్ మెటీరియల్స్ సంస్థను ప్రధాని కోరారు. అదే విధంగా ప్రాసెస్ టెక్నాలజీ అభివృద్ధికి, భారతదేశానికి ఉన్న అధునాతన పాకేజింగ్ సామర్థ్యాన్ని పెంచటానికి రావాల్సిందిగా కూడా అప్లైడ్ మెటీరియల్స్ ను ప్రధాని కోరారు.  

బోధనారంగంలోనూ అప్లైడ్ మెటీరియల్స్ సంస్థ సహకారంతో నైపుణ్యమున్న సిబ్బందిని తీర్చిదిద్దే అవకాశాలు పరిశీలించాలని డికర్సన్ ను ప్రధాని ఈ సందర్భంగా కోరారు. 

***