ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ కోస్టా లు అపూర్వమైన స్టార్ట్- అప్ పోర్టల్ అయిన ‘ది ఇండియా- పోర్చుగల్ ఇంటర్నేషనల్ స్టార్ట్- అప్ హబ్’ ( ఐపిఐఎస్ హెచ్)ను ఈ రోజు లిస్బన్‌లో ప్రారంభించారు.
స్టార్ట్- అప్ ఇండియా చొరవతో వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమ మంత్రిత్వ శాఖలు మరియు స్టార్ట్- అప్ పోర్చుగల్ ల మద్దతుతో ఏర్పడిన ప్లాట్ ఫామ్ ఇది. ఉభయ దేశాలలో పరస్పరం సహకరించుకునే ఔత్సాహిక పారిశ్రామికుల భాగస్వామ్యాన్ని ఏర్పరచడమే దీని ముఖ్యోద్దేశం.
ఐపిఐ ఎస్ హెచ్ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇది బెంగళూరు, ఢిల్లీ, లిస్బన్ నగరాల్లో గల స్టార్ట్- అప్ హాట్ స్పాట్స్ సమాచారాన్ని అందిస్తుంది. వీటికి సంబంధించిన అనుబంధ అంశాలను, అంటే విధానాలు, పన్నులు, వీసా అవకాశాలు తదితరాలను తెలియజేస్తుంది. స్టార్ట్- అప్స్ కు సహకరించడానికి వీలుగా గో- టు- మార్కెట్ మార్గదర్శకాలను అభివృద్ధి చేస్తుంది.
పరస్పర సామర్థ్య నిర్మాణంలో ఐపిఐఎస్ హెచ్ సహాయం చేస్తుంది. పలు రంగాలకు సంబంధించిన స్టార్ట్- అప్స్, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్ల మధ్య బంధం ఏర్పడడానికి ఇది కృషి చేస్తుంది. భారతదేశంలో, పోర్చుగల్ లో ఉండే గౌరవనీయ అంబాసిడర్ల నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తుంది. తద్వారా ఇరు దేశాల్లో ఉండే స్టార్ట్- అప్ కంపెనీలకు మార్గదర్శకత్వం లభిస్తుంది.
పూర్వ రంగం
భారతదేశం, పోర్చుగల్ మధ్య స్టార్ట్- అప్ ల రంగంలో పరస్పరం సహకరించుకొని ప్రగతి సాధించే అంశాలు అనేకం ఉన్నాయి. యూరోప్ లో కొత్తగా వ్యాపార నిర్మాణానికిగాను పోర్చుగల్ కు అత్యధిక అవకాశాలున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక రంగానికి కావలసిన అనువైన, ఉజ్జ్వలమైన యూరప్ సంబంధిత వాతావరణాన్ని పోర్చుగల్ కలిగివుంది. 2016 తరువాత నుండి మూడేళ్లుగా లిస్బన్ వెబ్ శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తోంది. ఇది ఈ రంగంలో ప్రధానమైన అంతర్జాతీయ సాంకేతిక సమావేశం. చివరగా జరిగిన వెబ్ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం నుండి 700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. స్టార్ట్- అప్స్ ను ప్రోత్సహించడానికి భారతదేశం, పోర్చుగల్ ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయి.
***