Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అధ్య‌క్షులు శ్రీ శీ జిన్ పింగ్ తో టెలిఫోన్ లో మాట్లాడి అభినంద‌న‌లు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి


చైనా ప్రజా గణతంత్రం అధ్య‌క్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ చిన్ ఫింగ్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.

చైనా ప్రజా గణతంత్రం అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌రొక్క‌ మారు ఎన్నికైన శ్రీ శీ చిన్ ఫింగ్ ను ప్రధాన మంత్రి అభినందించారు.

ఇరవై ఒకటో శ‌తాబ్దాన్ని ‘ఆసియా శ‌తాబ్దం’ గా సాకారం చేసుకోవాలంటే- శరవేగంగా వృద్ధి చెందుతున్న రెండు ప్ర‌ధాన శ‌క్తులైనటువంటి చైనా మరియు భార‌త‌దేశం ల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీల‌క‌మ‌ని- ఉభ‌య నేత‌లు అంగీక‌రించారు.

అంతేకాకుండా ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడి ప‌డి ఉన్న అంత‌ర్జాతీయ అంశాలలోను, ప్రాంతీయ అంశాల‌లోను తమ స‌న్నిహిత సంప్ర‌దింపుల‌ను కొన‌సాగించాల‌ని కూడా ఇరువురు నేతలు ఓ అంగీకారానికి వ‌చ్చారు.

****