Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.

భారతదేశం, రష్యా ల 22వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కిందటి నెల రష్యాలో తాను జరిపిన పర్యటన విజయవంతం అయిన సంగతిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చారు.

అనేక ద్వైపాక్షిక అంశాలలో చోటు చేసుకొన్న పురోగతిని నేతలు ఇద్దరూ సమీక్షించారు. భారత్ రష్యా ల మధ్య అమలవుతున్న ప్రత్యేక, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దుకోవడానికి చేపట్టదగ్గ చర్యలపైన కూడా వారు చర్చించారు.

పరస్పర హితం ముడిపడ్డ అనేక ప్రాంతీయఅంతర్జాతీయ అంశాల పై కూడా వారి అభిప్రాయాలను వారు ఒకరితో మరొకరు తెలియజెప్పుకొన్నారు.

ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న రష్యా-ఉక్రెయిన్ పోరాటంపై నేతలు ఇద్దరూ తమ అభిప్రాయాలను పరస్పరం వెల్లడించుకొన్నారు.  ఉక్రెయిన్ ను ఇటీవల తాను సందర్శించినప్పటి విషయాలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా వివరించారుఈ సంఘర్షణకు నిబద్ధత కలిగిన, శాంతియుత పరిష్కారాన్ని సాధించాలంటే సంబంధిత వర్గాలన్నిటి మధ్య చిత్తశుద్ధితో కూడినఅమలు పరచదగ్గ కార్యాచరణ ప్రణాళికకు తోడు సంభాషణ కుదౌత్యానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

తరచుగా సంప్రదింపులు జరుపుకొంటూ ఉందామని ఇద్దరు నేతలు అంగీకరించారు.

 

***